ఏపీకి ఒకటే రాజధాని.. జగన్ నిర్ణయంతో పార్టీకి ఇబ్బందులు తప్పవా?

YS-Jagan (1)

ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులను అమలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదనే సంగతి తెలిసిందే. అయితే మూడు రాజధానుల అమలు ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఒకే రాజధాని దిశగా జగన్ అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజధాని విషయంలో జగన్ నిర్ణయాలు మారాయని బోగట్టా.

అయితే అమరావతిని కాకుండా విశాఖను రాజధానిగా ప్రకటించాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఇన్వెస్టర్స్ మీట్ జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ వర్గాల బోగట్టా. రాజధాని విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంటే పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే అమరావతి సమస్యలకు కూడా జగన్ చెక్ పెట్టాల్సి ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

2024 ఎన్నికల సమయానికి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం ముందడుగులు వేయాల్సి ఉందని సమాచారం అందుతోంది. అయితే విశాఖను మాత్రమే రాజధానిగా ఫిక్స్ చేస్తే అమరావతి, కర్నూలు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ వ్యతిరేకతను జగన్ సర్కార్ ఏ విధంగా అధిగమించనుందో తెలియాల్సి ఉంది.

ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉందని కొంతమంది సూచనలు చేస్తున్నారు. జగన్ సర్కార్ సైతం తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 2024 ఎన్నికల్లో గెలవడమే జగన్ సర్కార్ లక్ష్యం కాగా ఈ లక్ష్యం విషయంలో జగన్ సర్కార్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.