వైసీపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అవినీతి లేని ప్రభుత్వం అని జగన్ చెబుతుండగా అందుకు భిన్నంగా అంబటి తీరు ఉంది. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా అంబటి మాత్రం తనకు నచ్చిన విధంగా అడుగులు వేస్తూ వార్తల్లో నిలుస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడటంతో అంబటిపై ఈ కేసు నమోదైందని సమాచారం.
కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి కుటుంబాన్ని అంబటి లంచం అడిగారని కామెంట్లు జోరుగా వినిపించాయి. ఏకంగా రెండున్నర లక్షల రూపాయల లంచం అడిగారని తెలిసి నెటిజన్లు సైతం షాకయ్యారు. అంబటి తన ప్రవర్తనను మార్చుకోవాలని నెటిజన్లు సైతం సూచిస్తున్నారు. మళ్లీ మళ్లీ వివాదాల్లో చిక్కుకుంటే అంబటికి టికెట్ దక్కడం కూడా కష్టమేనని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సైతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మంచిది. మంత్రులు వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా పోయేది ప్రభుత్వం పరువేననే సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కూడా అంబటిపై చర్యలు తీసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. అవినీతి చేసేవాళ్లపై జగన్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొంతమంది నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంబటి రాంబాబు ఇకనైనా ప్రవర్తనను పనితీరును మార్చుకోవాల్సి ఉంది. ప్రజల్లో సైతం ఆయన ప్రతిష్ట మసకబారుతోంది. అంబటి రాంబబు కక్కుర్తి పనులను మానేయాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు. ఈ కామెంట్లు తన దృష్టికి వచ్చిన తర్వాత అయిన అంబటి రాంబాబు మారతారేమో చూడాల్సి ఉంది.