ఏపీ రైతులపై రెండున్నర లక్షల అప్పు.. జగన్ సర్కార్ చేస్తున్న తప్పు ఇదేనా?

CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 80 శాతం కుటుంబాలకు వ్యవసాయం మినహా మరో జీవనాధారం లేదు. అయితే రాష్ట్రంలోని రైతులు అప్పులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో ప్రతి రైతుపై ఏకంగా రెండున్నర లక్షల రూపాయల అప్పు ఉందని వెల్లడైన నివేదికలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితికి కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జగన్ సర్కార్ రైతు భరోసా స్కీమ్ తో పాటు మరికొన్ని స్కీమ్ లను సైతం అమలు చేస్తున్నా ఆ స్కీమ్ ల వల్ల పూర్తిస్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూరడం లేదనే సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమలైన పథకాలు కూడా ప్రస్తుత రైతులకు అమలు కావడం లేదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఎరువులు, మందుల ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.

ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకురేలా పలు నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాల వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో లబ్ధి కలగలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రైతు సంక్షేమ ప్రభుత్వంగా ప్రశంసలు అందుకోవడంలో జగన్ సర్కార్ ఫెయిలైందని కొంతమంది కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ కామెంట్లపై ప్రభుత్వం రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

జగన్ సర్కార్ ఎక్కడో తప్పటడుగులు వేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ తప్పటడుగులను ప్రభుత్వం ఇకనైనా సరిదిద్దుకోవాల్సి ఉంది. ఇవే పొరపాట్లు పునరావృతం అయితే ఆ ఎఫెక్ట్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ఈ కామెంట్ల విషయంలో జగన్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.