జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు.. ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరుగుతోందా?

972875-jagan-mohan-reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు జమవుతున్నాయని అందరికీ తెలుసు. ఈ విధంగా జరగడం వల్ల అప్పులు తీసుకుని వాయిదాలు చెల్లించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జగన్ సర్కార్ పై సర్కారు పనితీరుపై ఫిర్యాదు చేయడానికి కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ ను కలిసింది.

అయితే ఉద్యోగుల సంఘం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం గురించి ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఉద్యోగుల సంఘంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. పత్రికలు, మీడియాలో జరిగిన ప్రచారం ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉద్యోగుల సంఘం సంప్రదించి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రోసా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల సంఘం గవర్నర్ ను కలిసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఉద్యోగుల సంఘంపై చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగులకు మరింత దూరమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోకుండా గోరుతో పోయే సమస్యలు గొడ్డలి వరకు ప్రభుత్వం తెచ్చుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులలో వ్యతిరేకత వల్ల గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ సర్కార్ అధికారంలోకి రావడం వెనుక ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. గతాన్ని మరిచి ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.