ఏపీలో అభివృద్ధి అందని ద్రాక్షేనా.. పాలకులు మారినా సమస్యలు పట్టవా?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ చేసిన అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏపీలోని పలు ప్రాంతాల్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్ల వల్ల కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో కూడా ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదనే సంగతి తెలిసిందే.

విభజన వల్ల ఏపీ నష్టపోతే పాలకుల తీరు వల్ల ఏపీ మరింత నష్టపోతుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పాలకులు మారినా వాళ్లకు ప్రజల సమస్యలు పట్టవా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించడంలో ముఖ్యమంత్రులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని ప్రశ్న ఎదురవుతుండగా ఆ ప్రశ్నకు జవాబు దొరకడం లేదనే సంగతి తెలిసిందే.

భవిష్యత్తు తరాలకు సైతం అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ ఉండటం వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఏపీ ప్రజల పూర్తిస్థాయి కష్టాలు తీరడానికి మరో 40 సంవత్సరాల సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లాంటి రాజధాని ఏపీకి ఉండాలంటే ఎంతో ఓపిక ఉండాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ సర్కార్ అభివృద్ధి విషయంలో చేస్తున్న పొరపాట్లకు సంబంధించి ఎన్నో కథనాలు ప్రచారంలోకి వస్తున్నా వాటి గురించి స్పందించడానికి జగన్ సర్కార్ ఇష్టపడటం లేదు. జగన్ సర్కార్ ఇకనైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.