ప్రభుత్వ ఉద్యోగులలో వ్యతిరేకత.. సీఎం జగన్ దృష్టి పెట్టాల్సిందే?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నా అదే సమయంలో చిన్నచిన్న తప్పులు చేస్తూ విమర్శలు చేసే అవకాశం ఇస్తున్నారు. సీపీఎస్ రద్దు విషయంలో హామీ ఇచ్చింది జగన్ అనే సంగతి తెలిసిందే. జగన్ హామీ ఇవ్వని పక్షంలో ఉద్యోగులు సీపీఎస్ రద్దు కావాలని కోరేవారు కాదు. ఈ విషయంలో జగన్ ఒక విధంగా తమను మోసం చేశారని ఉద్యోగులు భావిస్తున్నారు.

సీపీఎస్ రద్దు సాధ్యం కాని హామీ అయినప్పటికీ ఉద్యోగులను సంతృప్తిపరిచే ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయం దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంది. సీపీఎస్ ఉద్యోగ సంఘాలు వచ్చే నెల ఒకటో తేదీన జగన్ ఇంటిని ముట్టడిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసులను విజయవాడలో మోహరించడం గమనార్హం.

టీచర్లు విజయవాడకు రాకూడదని ఇప్పటికే నోటీసులు సైతం అందాయని తెలుస్తోంది. జగన్ ను నమ్మి ఓట్లేయడంతో పాటు తమ కుటుంబాలు, బంధువులతో ఓట్లు వేయించిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం బాధ పడుతున్నారు. అధికారాన్ని వినియోగించి ఉద్యోగులను అణగదొక్కే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తే మాత్రం అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

ప్రభుత్వానికి బుద్ధి చెప్పే దిశగా ఉద్యోగులు అడుగులు వేయాల్సి ఉందని మరి కొందరు సూచనలు చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ మోసం చేసిందని భావనను కలిగి ఉన్న ఉద్యోగులు సీపీఎస్ విషయంలో కూడా ప్రభుత్వం మోసం చేస్తుండటంతో ఫీలవుతున్నారు. ఉద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అదే ఉద్యోగులను నమ్మించి మోసం మోసం చేస్తుండటం వాళ్లను ఎంతగానో బాధ పెడుతోంది.