నిరుద్యోగులకు జగన్ సర్కార్ షాకివ్వనుందా.. ఆ ఉద్యోగులకే ప్రాధాన్యత ఉంటుందా?

Andhra_CMO_Jagan 1200

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇస్తోందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇతర ఉద్యోగాలకు జగన్ సర్కార్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల భర్తీనే ఎక్కువగా ఉండనుందని ఇతర ఉద్యోగాల భర్తీపై జగన్ సర్కార్ దృష్టి పెట్టడం లేదని సమాచారం అందుతోంది.

జగన్ సర్కార్ ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా ఈ ఉద్యోగులు తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారనే భావనను కలిగి ఉందని తెలుస్తోంది. జగన్ యువతకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ల హృదయాల్లో, ఆ ఉద్యోగుల కుటుంబాల్లో స్థానం సంపాదించుకోవాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాలంటీర్ల వేతనాలు కూడా భారీ స్థాయిలో పెరగనున్నాయని సమాచారం అందుతోంది.

నిరుద్యోగులకు జగన్ సర్కార్ షాకివ్వనుండగా ఈ విధంగా చేస్తే నిరుద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో పదవీ విరమణ చేసే ఉద్యోగుల స్థానాలలో కూడా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు పని చేయనున్నారని సమాచారం. కొన్ని కీలక ఉద్యోగాల భర్తీ మినహా మిగతా ఉద్యోగాల భర్తీ ఉండబోదని తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థకే షాకిచ్చే దిశగా జగన్ సర్కార్ నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలిసి కొంతమంది షాకవుతున్నారు. జగన్ సర్కార్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. నిరుద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తే కోర్టుల నుంచి జగన్ సర్కార్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే సంగతి తెలిసిందే.