ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ జలకళ పేరుతో జగన్ సర్కార్ ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎక్కువమంది రైతులకు బెనిఫిట్ కలిగేలా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా బోర్లు వేయిస్తుండటం గమనార్హం.
5 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఆలోచనతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. రాష్ట్రంలోని 2 లక్షల రైతులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ను పొందే అవకశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రైతుల సమస్యలను తీర్చడానికి జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం 163 బోరింగ్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఐదేళ్లలో ఈ స్కీమ్ అమలు కోసం ప్రభుత్వం ఏకంగా 2340 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుందని తెలుస్తోంది. రైతులకు బోర్లు వేయించడంతో పాటు మోటార్లను కూడా అందజేస్తామని జగన్ సర్కార్ చెబుతుండటం గమనార్హం. పలు సాగునీటి ప్రాజెక్ట్ లను సరైన సమయానికి పూర్తి చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు.
మరోవైపు ఏపీలో నీటి లభ్యత గతంతో పోల్చి చూస్తే పెరగడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు బెనిఫిట్ కలుగుతోంది. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా అర్హత ఉన్న రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ, వార్డ్ వాలంటీర్లను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.