ల్యాప్ టాప్ బదులు ట్యాబ్ .. ఏపీ ప్రజల ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా?

జగన్ సర్కార్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ప్రజలను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు ప్రైవేట్ పాఠశాలలలో చదివే విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరేలా చేశారు. అయితే గతంలో జగన్ అమ్మఒడి విద్యార్థులకు బెనిఫిట్ కలిగేలా ల్యాప్ టాప్ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

అయితే ఈ మధ్య కాలంలో ల్యాప్ టాప్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఎక్కువ సంఖ్యలో ఆర్డర్ చేసినా అమ్మఒడి నగదుకు బదులుగా ల్యాప్ టాప్ లు ఇవ్వడం సాధ్యం కాదు. ఒకవేళ క్వాలిటీ లేని ల్యాప్ టాప్ లను ఇస్తే మాత్రం జగన్ సర్కార్ పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణం వల్లే వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ల్యాప్ టాప్ లకు బదులుగా ట్యాబ్ లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

ప్రభుత్వం ఇచ్చే ట్యాబ్ ల ద్వారా విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడేలా ఈ ట్యాబ్ ఉండనుందని తెలుస్తోంది. అయితే విద్యార్థులలో ఎవరైతే ట్యాబ్ ను పొందుతారో వాళ్లకు అమ్మఒడి డబ్బులు జమవుతాయా? లేదా అనే ప్రశ్న ఎదురవుతోంది. అమ్మఒడి డబ్బులు ఇచ్చి ట్యాబ్ లు ఇస్తే జగన్ సర్కార్ పై ఊహించని స్థాయిలో భారం పెరుగుతుంది.

అందువల్ల ట్యాబ్ ల విషయంలో జగన్ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో అనే చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వకుండా ట్యాబ్ ల పంపిణీ జరిగితే విద్యార్థుల తల్లీదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. జగన్ సర్కార్ విమర్శలపాలు కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.