మూడు రాజధానుల దిశగా జగన్ సర్కార్ అడుగులు.. ప్రభుత్వం వ్యూహం ఇదేనా?

ఎవరి నుంచి ఎన్ని నెగిటివ్ కామెంట్లు వ్యక్తమైనా ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేకపోయినా జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గడానికి అస్సలు ఇష్టపడటం లేదు. గతంలో న్యాయపరమైన ఇబ్బందుల వల్ల వెనక్కు తగ్గిన జగన్ సర్కార్ ఈసారి మాత్రం వెనక్కు తగ్గే అవకాశాలు దాదాపుగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. రేపు సాయంత్రం సమయానికి మూడు రాజధానుల బిల్లు శాననసభ ఆమోదం పొందనుందని తెలుస్తోంది.

మూడు రాజధానుల అంశమే ప్రధానంగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటంతో పాటు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. జగన్ ఈరోజు జరిగే సభలోనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్టు బోగట్టా. తెలుగుదేశం అడ్డు పడే అవకాశం ఉన్నప్పటికీ జగన్ సర్కార్ అందుకు సంబంధించిన వ్యూహాలను సైతం సిద్ధం చేసుకుందని తెలుస్తోంది.

రేపు సాయంత్రం మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన వెంటనే గవర్నర్ సంతకానికి పంపాలని జగన్ సర్కార్ భావిస్తోంది. వచ్చే సోమవారం నుంచి విశాఖ నుంచి పాలన జరిగేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది. కోర్టులో పిటిషన్లు దాఖలైనా విశాఖ నుంచి పాలన మొదలుకానున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రావని జగన్ సర్కార్ అనుకుంటోంది.

జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. జగన్ మూడు రాజధానుల విషయంలో తన పంతాన్ని నెగ్గించుకునే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేసి భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.