ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి నెల 1వ తేదీ నుంచి 2750 రూపాయల చొప్పున రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ జరగనుంది. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు సైతం పింఛన్ల పంపిణీ జరగనుందని సమాచారం అందుతోంది. అయితే ఇదే సమయంలో అర్హత లేకుండా పింఛన్లను పొందుతున్న వాళ్లకు పింఛన్లు కట్ అవుతున్నాయి.
కార్లు ఉన్నవాళ్లు, పొలాలు ఎక్కువగా ఉన్నవాళ్లు, ప్రభుత్వ పథకాలకు అర్హత పొందని వాళ్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వాళ్లు పింఛన్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇది సాధారణంగా జరిగేది కాగా కొంతమంది కావాలని వైసీపీ ప్రభుత్వం పరువు తీసేలా కథనాలను ప్రచారంలోకి తెస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
అర్హత లేనివాళ్లకు పింఛన్ ఇవ్వడాన్ని ఎవరూ సమర్థించరు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని అర్హతలు ఉన్నవాళ్లే పింఛన్ ను పొందలేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. జగన్ రాబోయే రోజుల్లో కూడా అర్హత లేని వాళ్లకు బెనిఫిట్ కలగకుండా నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. టీడీపీకి జగన్ తన నిర్ణయాలతో వరుస షాకులిస్తున్నారు.
టీడీపీ వైసీపీ మధ్య 2024 ఎన్నికల్లో గట్టి పోటీ ఉండనుండగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాలి. తనపై వస్తున్న వ్యతిరేకత విషయంలో జగన్ జాగ్రత్త పడాల్సి ఉంది. వ్యతిరేకత ఉన్నవాళ్ల మనస్సు మార్చే విధంగా జగన్ సర్కార్ జాగ్రత్త పడాల్సి ఉంది.