ఐటీ రంగంలో వెనుకబడుతున్న ఆంధ్రప్రదేశ్.. సీఎం జగన్ గమనిస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు అధికార పార్టీకి అనుకూలంగా లేవు. అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్ పై ఊహించని స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఎన్నికల్లో వైసీపీని దింపేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఏపీ ఐటీ ఉత్పత్తులకు సంబంధించి బీహార్ తో పోలిస్తే వెనుక ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. సీఎం జగన్ ఈ పరిణామాలను గమనించాల్సి ఉంది.

ఒకసారి అధికారం కోల్పోతే ఆ తర్వాత వైసీపీ నేతలు బాధ పడినా ప్రయోజనం ఉండదు. నిధుల లేమి అభివృద్ధి జరగకపోతే ప్రజల నుంచి కూడా ఏదో ఒక సందర్భంలో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఐటీలో ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే అధమంగా ఉందని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు. ఏపీ మంత్రులు సైతం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడే విషయంలో ఫెయిలవుతున్నారు.

చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అభివృద్ధితో పోల్చి చూస్తే ప్రస్తుతం ఏపీలో జరిగిన అభివృద్ధి తక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా అడుగులు పడతాయో లేదో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మేధావుల సలహాలను జగన్ సర్కార్ పాటించాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.

జగన్ సర్కార్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఇతర పార్టీలకు జగన్ సర్కార్ విమర్శలు చేసే అవకాశం ఇస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ కు కేవలం 16 నెలల సమయం మాత్రమే ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.