Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎడమచేతి వేలికి హెల్త్ ట్రాకర్ రింగు పెట్టుకున్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లేని విధంగా తన వేలికి హెల్త్ ట్రాకర్ రింగ్ పెట్టుకోవడంతో ప్రస్తుతం ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఈ ఉంగరం వేలికి ఉండటం వల్ల మన హెల్త్ అప్డేట్స్ కూడా తెలుస్తాయని గతంలో చంద్రబాబు నాయుడు ఈ ఉంగరం ప్రత్యేకతలు తెలియజేశారు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఉంగరంతో కనిపించటం చర్చలకు కారణం అవుతుంది. ప్రతిరోజూ ఎన్నో కార్యక్రమాలతో బిజీగా ఉండే జగన్ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తకుండా ఈ రింగ్ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఈ రింగ్ పెట్టుకున్న తర్వాత అధికారంలోకి వచ్చారని ఇక జగన్ కూడా అధికారం కోసమే ఈ ఉంగరం పెట్టుకున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి.
మరి జగన్ అనుకున్న విధంగా వచ్చే ఎన్నికలలో అధికారం అందుకుంటారా లేదా తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే వీళ్లంతా కేవలం అభిమానంతో వస్తున్న వారు మాత్రమే అని చెప్పాలి .ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకొని బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైనే ఉందని చెప్పాలి. ఈయన కోసం పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తున్నప్పటికీ ఓట్ల రూపంలో అభిమానం కనిపించలేదని చెప్పాలి. 2019 ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించిన జగన్ 2024 ఎన్నికలలో మాత్రం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇలా 11 స్థానాలు వచ్చినప్పటికీ ఈయనకు 40% ఓటు బ్యాంకు ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలో తన ఓటు బ్యాంకు పెంచుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలలో తిరుగు ఉండదని అలాగే గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.