ఉపాధ్యాయుల ఉసురు మంచిది కాదు జగన్.. ఆ క్లారిటీ ఇచ్చేయొచ్చుగా?

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు జమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించదు. జీతాలు ఆలస్యం చేస్తే ఉద్యోగులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ నెల 13వ తేదీ వచ్చినా జీతాలు జమ కాకపోవడంతో ఉద్యోగులు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీతాలు ఎప్పుడు క్రెడిట్ అవుతాయనే ప్రశ్నకు కూడా జగన్ సర్కార్ దగ్గర సమాధానం లేదు.

నవంబర్ నెల వేతనాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపై ధర్నాలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు ఉద్యోగులు నిరసన తెలిపితే నోటీసులు అందిస్తుండటం, ధర్నాలు చేస్తే కేసులతో వేధిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. 2019 ఎన్నికల ముందు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగించనని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

అదే సమయంలో ఉద్యోగ సంఘాలు రాస్తారోకోలు, ధర్నాలు చేయడం కరెక్ట్ కాదంటూ మంత్రి బొత్స చేస్తున్న కామెంట్లు ఉద్యోగులకు మరింత ఆగ్రహం కలిగిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు వేల కోట్ల రుపాయలు కేటాయిస్తున్న జగన్ సర్కార్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించడంలో ఫెయిల్ అవుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ఉద్యోగులు సకాలంలో వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.

జీతాలు రాకపోవడం ఆందోళనకరం అంటూ ఉద్యోగులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేవని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించడంలో ఎందుకు ఫెయిల్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల నుండి వ్యక్తమవుతున్న వ్యతిరేకత వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీ తీవ్ర స్థాయిలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.