సాధారణంగా ఏ రాజకీయ పార్టీకి అయినా ఇతర రాజకీయ పార్టీల నుంచి సమస్యలు ఎదురవుతాయి. అయితే వైసీపీకి మాత్రం భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీ నేతలే ఆ పార్టీకి శత్రువులుగా మారుతున్నారు. జగన్ ను మెప్పించాలని నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
కడప జిల్లాలోని ప్రముఖ యూనివర్సిటీలలో యోగి వేమన యూనివర్సిటీ కూడా ఒకటి. ఆ యూనివర్సిటీలో వేమన విగ్రహానికి బదులుగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడం గురించి వివాదం మొదలైంది. జగన్ సర్కార్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటంపై ప్రజల నుంచి సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2006లో ఈ విశ్వ విద్యాలయం ఏర్పాటు కాగా వేమన విగ్రహాన్ని తొలగించడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
జగన్ సర్కార్ ఇలాంటి పనులు చేస్తే ఆ పార్టీ పతనం మొదలైనట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తి, గొప్ప సీఎం అని అయితే జగన్ కు తెలియకుండా ఈ నిర్ణయాలు అమలవుతున్నాయా? తెలిసే అమలవుతునాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు ఏ విధంగా సమర్థించకున్నా ఈ పనిని అందరూ సమర్థించే అవకాశం అయితే లేదు.
జగన్ మేలు కోరేవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న విషయాలను జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి మంచి పేరు సంపాదించుకున్న జగన్ సర్కార్ పరువు ఇలాంటి చిన్నచిన్న తప్పుల వల్ల పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.