Home Andhra Pradesh బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు: జగన్ రియాక్షన్ ఇదే

బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు: జగన్ రియాక్షన్ ఇదే

గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు నాయుడుని మీడియా ఎదుట తనదైన శైలిలో దూషించారు కేసీఆర్. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అందరు మీడియా ముందుకి వచ్చి కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలపై, కేసీఆర్ భాషపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక తమ అధినేతను అంటే టీఆరెస్ శ్రేణులు ఊరుకుంటారా? వారు కూడా మీడియా ముందుకొచ్చి చంద్రబాబు అండ్ కో కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రతిపక్ష నేత జగన్ స్పందించారు.

వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో సాగింది. పలాస, ఉండ్రుకుడియ నుండి ప్రారంభమైన 333 వ రోజు పాదయాత్ర వెంకటాపురం మీదుగా గరుడఖంది వరకు సాగింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన జగన్, విరామం అనంతరం పలాస భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. “పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఏపీకి హోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తాను అన్నారు. దీనిని ఆహ్వానిస్తున్నాను. మన 25 మంది ఎంపీలకు మరో 17 మంది ఎంపీలు తోడైతే మొత్తం 42 మంది ఎంపీలు అవుతారు. 42 మంది ఎంపీలు హోదాకు మద్దతు తెలపడాన్ని ఎవరైనా సంతోషిస్తారు. బాబు మాత్రం నీచ రాజకీయాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు వైఎస్ జగన్.

తెలంగాణ ఎన్నికల సమయంలో వైసీపీ టీఆరెస్ పార్టీకే మద్దతుగా ఉంది. టీఆరెస్ గెలిచినప్పుడు వైసీపీ అభిమానులు రాష్ట్రంలో వేడుకలు చేసుకున్నారు. త్వరలో ఏపీ ఎన్నికలు కూడా మొదలవనున్నాయి. సీఎం కేసీఆర్ రిజల్ట్స్ వచ్చాక ఏపీ లో వేలుపెడతాను అన్నారు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నారు. ఆయన వైసీపీ తరపున ప్రచారం చేస్తారేమో అని ఏపీ రాజకీయాల్లో నడుస్తోన్న చర్చ. చంద్రబాబును గద్దె దింపే దిశగా కేసీఆర్ వైసీపీ తరపున ప్రచారం చేయాలనీ వైసీపీ వర్గాలు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Posts

‘గల్లా సార్ వెళ్లిపోతా అంటున్నారు’ చంద్రబాబుకి బిగ్ బ్యాడ్ న్యూస్ అందింది

ఓటమి షాక్ నుండి తేరుకుంటున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి నేతలు వరుస షాక్స్ ఇస్తున్నారు.  ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లిపోయారు.  ఇక గెలిచిన ముగ్గురు ఎంపీలు తలోదిక్కు అన్నట్టు ఉన్నారు.  కేశినేని నాని,...

‘అదేంటి ఇలా జరిగింది’ నమ్మలేకపోతోన్న దేవినేని ఉమ

దేవినేని ఉమామహేశ్వరరావు.. టీడీపీలో ప్రముఖమైన వ్యక్తి.  దశాబ్ద కాలంపాటు తెలుగుదేశంలో ఈయన మాట వేదవాక్కుగా చెలామణీ అయింది.  రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన దేవినేని ఉమా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. ...

తిరుపతిలో కొడితే రాష్ట్రం మొత్తం టీడీపీ క్లోజ్.. ఇదే జగన్ ప్లాన్ 

సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్న ఉపఎన్నికలు కావడంతో తిరుపతి లోక్ సభ బై ఎలక్షన్ల మీద అన్ని పార్టీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.  సర్వ శక్తులను కూడగట్టుకుని బరిలోకి దిగుతున్నాయి.  ఇప్పటికే చంద్రబాబు నాయుడు పనబాక లక్ష్మిని అభ్యర్థిగా...

బైరెడ్డి అన్న ఆ మాటకు నానియే షాకయ్యారు..జగన్‌ చెవినపడితే ఎమన్నా ఉందా ?

వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా సొంత పార్టీ నేతలకు నిత్యం అందుబాటులో ఉండేవారు.  ప్రతిఒక్కరితోనూ వ్యక్తిగతంగా టచ్లో ఉండేవారు.  కానీ సీఎం అయ్యాక.. కనీసం ముఖం చూపించే టైం కూడ లేకుండాపోయింది ఆయనకు.  పాలనలో...

Latest News