ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత జగన్ సూటిగా ఒక ప్రశ్న వేశారు.
ఎపి లో ఎవరి ఇళ్ల మీదో ఇన్ కమ్ టాక్స్ దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు వణికిపోతున్నారు? మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?
విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఈ ప్రశ్న వేశారు. చంద్రబాబు స్పందించాలని అడిగారు.
ఎక్కడో, ఎవరి మీదో ఏవో అరోపణలతో ఐటి దాడులు జరిగితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చించడం పట్ల ఆయన అభ్యంతరం చెప్పారు. ఇది చాలా విడ్డూరంగా ఉందని అన్నారు.
దానికి తోడు ఈ ఐటి దాడులను రాష్ట్ర ం మీద కేంద్రం యుద్ధం ప్రకటించడంగా ఎలా చిత్రీకరిస్తున్నారో చెప్పాలని అన్నారు.
‘ నా మీద, నా కుటుంబం మీద సిబిఐ రైడ్స్ జరిగినపుడు వీళ్లెవరూ స్పందించలేదు. రాష్ట్రంలోని ఒక వ్యక్తి మీద సిబిఐ దాడులు చేసినపుడు కేంద్రం దాడిగా కనిపించలేదా?’ అని జగన్ ప్రశ్నించారు.
ఎవరి ఇళ్లలోనో ఐటి సోదాలు చేస్తే చంద్రబాబు భయపడటాన్ని ప్రస్తావిస్తూ, తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే అందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తూ ఉందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ఆదాయపు పన్ను శాఖ దాడుల మీద బాగా అతిగా స్పందిస్తున్నారని జగన్ విమర్శించారు.