మీ బాధలు విన్నాను, నేనున్నాను, అధైర్య పడవద్దు…

 

‘గ్రామాల‌లో చితికి పోయిన రైతుల బాధల‌ను తెలుసుకున్నా. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ స‌దుపాయం లేక విద్యార్థుల బాధ‌ల‌ను విన్నాను.108 వాహ‌నం స‌దుపాయం లేక అనారోగ్యంతో బాధ ప‌డుతోన్న వారిని గ‌మ‌నించాను.పెరాల‌సిస్‌తో బాధ‌ ప‌డుతోన్న వారెంద‌రో ఉన్నారు. ఆప‌న్నుల గురించి ప‌ట్టించుకునే వారే లేరు. మ‌ద్యానికి కుటుంబ య‌జ‌మానులు బానిస‌లు కాగా భార్యలు అవ‌స్థ ప‌డ‌టాన్ని చూశాను,’

తన సుదీర్ఘ యాత్రలో ఈ కష్టాలు నష్టాలు కళ్లారా చూశానని, చెవులారా విన్నానని, మీకు అండగా ఉంటానని మీ క‌డ‌గండ్ల‌ను తీరుస్తాన‌ని …వైయ‌స్సార్‌సీపీ అధ్య‌క్షుడు  వైయ‌స్ జ‌గ‌న్ న‌ర్సిపట్నం ప్ర‌చార స‌భ‌లో హామీ ఇచ్చారు.

 

‘‘రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి మనిషి, ప్రతి కుటుంబానికి ఈ వేదికపై నుంచి ఒక మాట ఇస్తున్నాను. ‘నేను విన్నాను. నేను ఉన్నాను’. 3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ఎందరినో కలిశాను. అన్ని వర్గాల వారి బాధలు స్వయంగా చూశాను. కష్టాలు విన్నాను. అందుకే అన్నింటినీ తీరుస్తాను’’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

‘ఏపీలో 2.30 ల‌క్ష‌ల ఉద్యోగ ఖాళీలున్నాయి. ఉపాధి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడి పోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాల‌కు వెళుతున్నారు. మ‌న పి్ల్ల‌లు ఎన్ని బాధ‌లు ప‌డుతోన్న సంగ‌తి నాకు తెలుసు. మ‌రో వైపు మంచి నీటి కోసం గ్రామాల‌కు గ్రామాలు ఇబ్బంది ప‌డుతున్నాయి. పొట్ట నింపుకోవ‌డానికి రోజు వారి కూలీల‌కు వెళుతోన్న స్త్రీల‌ను చూశాను. ఆయా సామాజిక వ‌ర్గాల స‌మస్య‌లను అధ్య‌య‌నం చేశాను. వైయ‌స్సార్సీపీకి ఓట్లు వేయాల‌ని అడ‌గ‌డానికి ముందు మేమేమి చేస్తామో వివ‌రిస్తాను,’ వినండని చెప్పారు.

లంచాల రాజ్యం పోతుంది

ఏపీలో రేష‌న్ కావాల‌న్నా.. పెన్ష‌న్ కావాల‌న్నా..లంచం . లంచాలు లేనిదే ప‌ని జ‌ర‌గ‌దు. మీ అంద‌రి స‌హ‌కారంతో అధికారంలోకి వ‌చ్చే వైయ‌స్సార్‌సీపీ ప్ర‌భుత్వం సుప‌రిపాల‌న‌ను అందిస్తుంది. ప్ర‌జ‌ల బాగోగుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని వారిని ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంది. కుల పిచ్చి లేని పాల‌న‌ను అందిస్తాము.

శాంతిభద్రతలుంటాయి

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు లోపించాయి. మా చిన్నాన్న‌ను ఇంట్లోఉండ‌గా గొడ్డ‌లితో న‌రికి చంపారు. మ‌హిళా ఎంఎఆర్ వోను జుట్టు ప‌ట్టుకుని టీడీపీ ఎంఎల్ ఏ లాగినా పోలీసులు చ‌ర్య‌లు తీసుకోరు. మా ప్ర‌భుత్వ హ‌యాంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు టాప్ ప్రాయారిటీ. అవినీతిమ‌య‌మైన జ‌న్మ భూమి క‌మిటీల‌ను ఎత్తి వేస్తాం.

పేద‌ల చ‌ద‌వుల భారాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. కేవ‌లం రెండే రెండు సంవ‌త్స‌రాల‌లో విద్యా రంగంలో ఏ విధంగా విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకుని వ‌స్తామో మీరే చూస్తారు. ఏ కుటుంబం గానీ ఆస్తులు అమ్ముకునే ద‌య‌నీయ స్థితి ఉండ‌రాదు.

వ్య‌వ‌సాయం ఒక పండుగ లాగా త‌యారు చేస్తాం. రైతాంగానికి గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల‌కు అయిదు సంవ‌త్స‌రాల‌లోగా ల‌క్షాధికారుల‌ను చే్స్తాం. ప్ర‌తి మ‌హిళ ఆర్థిక స్థితి గ‌తుల‌ను మెరుగు ప‌రుస్తాం. ఏటా ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌లను నిర్వ‌హించి నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశాలు కల్పిస్తాం.

ఏపీ అభివృద్ది కావాటంలే హోదా స్థాయి త‌ప్ప‌ని స‌రి. ఏపీకి హోదా ను సాదించి అన్ని రంగాలు అబివృద్ధి అయ్యేలా చూస్తాం. ఆయా ప్రాంతాల‌లో ఏర్పాటు అయ్యే ప‌రిశ్ర‌మ‌ల‌లో స్థానికుల‌కే 70 శాతం ఉద్యోగాలు ల‌భించేలా కొత్త‌గా ఒక చ‌ట్టాన్ని రూపొందిస్తాం. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను స‌త్వ‌రం పూర్తి చేసి సాగు తాగు నీటి స‌దుపాయాన్ని క‌ల్పిస్తాం. జ‌ల‌య‌జ్ఞానికి అధిక ప్రాధాన్య‌త ఉంటుంది.

జిత్తుల మారి చంద్రబాబు

ఈ ఎన్నిక‌ల‌లో ఒక జిత్తుల మారి న‌క్క‌తో యుద్దం చేస్తున్నాం. మోసాలు చేసే చంద్ర‌బాబుతో త‌ల‌ప‌డుతున్నాం. ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఆయ‌న గ్రామాల‌కు డ‌బ్బు మూట‌ల‌ను పంపిస్తారు. అనేక ప్ర‌లోభాలు పెడ‌తారు. ప్ర‌తి ఓట‌రుకు రూ3 వేలు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తారు. చంద్ర‌బాబు ఇచ్చే డ‌బ్బుకు మోస పోవ‌ద్ద‌ని ప్ర‌తి కుటుంబానికి తెలియ చెప్ప‌నండి.డి. రానున్న‌ది వైయ‌స్సార్‌సీపీ ప్ర‌భుత్వం. అని

ద‌ళితుల‌కు తోడుగా నిలుస్తాం. అడ్డ‌గోలుగా డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మోసం చేసిన చంద్ర‌బాబు మోసాల గురించి వారికి తెలియ జేయండి. ఎన్నిక‌ల నాటికి డ్వాక్రా రుణాలు ఏమేర‌కు ఉన్నాయో ఆ రుణాన్ని నాలుగు ద‌ఫాలుగా చెల్లిస్తాం. వ‌డ్డీ లేని రుణాల‌ను రైతులు, మ‌హిళ‌ల‌కు అందిస్తాం.
చంద్ర‌బాబు ఎండ మావుల‌ను చూసి న‌మ్మ‌కండి.

ఈ ఎన్నిక‌లు ధ‌ర్మానికి అధ‌ర్మానికి మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం. విశ్వ‌స‌నీయ‌త‌కు వంచ‌న మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం.. ఈకురు క్షేత్ర సంగ్రామంలో ప్ర‌తి ఒక్క‌రి దీవెన‌లు వైయస్సార్‌సీపీకి కావాలి. ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం మాకు అవ‌స‌రం,’ అని జగ‌న్ పేర్కొన్నారు.