పవన్ – లోకేష్ నెత్తిన పాలు పోస్తున్న జగన్!

అధికారపార్టీ అధినేత అయిన జగన్ ఏమిటి.. ప్రధాన ప్రతిపక్ష నేత కుమారుదైన లోకేష్ కి.. ప్రతిపక్ష నేత అవునో కాదో తెలియని పవన్ కి నెత్తిన పాలు పొయ్యడం ఏమిటి.. అని అనుకోవచ్చు. కానీ.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూస్తే… వారిరువుని నెత్తిన జగన్ పాలు పోసారన్నది అక్షర సత్యం అనే చెప్పుకోవచ్చు!

విషయానికొస్తే… ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2024 లోనే అనేది వైకాపా నాయకులు చెబుతున్నమాట. కాసేపు అది నిజం కాదు.. “మరో రెండు నెలల్లో జగన్ ఎన్నికలకు వెళ్లబోతున్నారు” అన్నదే నిజం అనుకుంటే..! ఆ స్టేట్ మెంట్ పవన్ – లోకేష్ లను ఏస్థాయిలో ఇబ్బంది పెడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం!

ప్రస్తుతం ప్రజాసమస్యలు తెలుసుకుంటానంటూ లోకేష్ పాదయాత్రలో ఉన్నారు. అది ఇప్పుడే నలరోజులు పూర్తిచేసుకుంటున్న పరిస్థితి. ఇంకా వేల కిలోమీటర్ల పాదయాత్ర, సుమారు ఇంకా 24 జిల్లాల సభలు బాకీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అర్థంతరంగా యాత్రను ఆపేయాల్సి రావొచ్చు. ఫలితంగా.. మధ్యలోని కాడి దింపేసినట్లవుతుంది! సో.. నో యూజ్!

ఇక పవన్ కల్యాణ్ గురించి అయితే చెప్పే పనేలేదు. వారాహికి పూజ చేసి పార్కింగ్ లో పెట్టిన పవన్.. ఇప్పటివరకూ జనాల్లోకి రాలేదు. 175 నియోజకవర్గాలూ హెలీకాప్టర్ లో తిరిగి – సభలు పెట్టుకోవాలన్నా కనీసం 100 రోజులు పట్టే పరిస్థీతి. అలాంటిది రోడ్డుమార్గంలో 175 కిలోమీటర్లు చుట్టి రావాలంటే… అది తీసుకునే సమయం చాలా ఎక్కువ.

ఇదే క్రమంలో… ఇప్పటికే నాలుగైదు సినిమాలకు సంతకాలు చేసేసి అడ్వాన్సులు పుచ్చేసుకున్న పవన్… వాటన్నింటినీ పూర్తిచేసి రావాలంటే కనీసం ఏడాదిన్నర నుంచి రెండు ఏళ్లు పట్టొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అవి పూర్తి చేయకుండా బయటకు వచ్చినపక్షంలో… భారీ బడ్జెట్ అవ్వడం వల్ల – నిర్మాతలు రచ్చ రచ్చ చేసే ప్రమాధం లేకపోలేదు.

కాబట్టి… జగన్ ముందస్తుకు రాకూడదనే ఆలోచన చేయడం వల్ల వైకాపా కు ఎంత ఉపయోగమో, వైకాపా ఎమ్మెల్యేలకు ఎంత మేలో తెలియదు కానీ… లోకేష్ – పవన్ లకు మాత్రం నెత్తిన పాలు పోసినంత ప్రయోజనం అంటున్నారు విశ్లేషకులు!