ప్రజలకు దూరంగా వైఎస్ జగన్.. అధికారం తెచ్చిన మార్పు ఇదేనా?

YS Jagan

ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల వల్ల లక్షల సంఖ్యలో లబ్ధిదారులు ఈ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ను పొందుతున్నారు. రాష్ట్రంలోని 70 శాతం నియోజకవర్గాలలో జగన్ పాలనపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉండటం గమనార్హం. అయితే జగన్ మాత్రం ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం మారేలా కనిపించడం లేదు.

ప్రజలకు దూరంగా వైఎస్ జగన్ ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, పవన్ చేస్తున్న విమర్శలపై జగన్ ఘాటుగా రియాక్ట్ అయితే బాగుంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శల వల్ల ప్రయోజనం ఏంటని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ఎంతో సమయం లేదు. రోజులు వేగంగా గడుస్తున్నాయి. ప్రజల్లో వైసీపీపై పాజిటివ్ అభిప్రాయం ఉన్నా కొంతమంది నెగిటివ్ గా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మారిపోయారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీలో జగన్ ప్రవర్తన వల్ల కొంతమంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం చాలామంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు. అయితే జగన్ మాటకు ఎదురు చెప్పలేక చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

జగన్ గతంలో ప్రజల్లోకి రాకపోవడానికి కరోనాను సాకుగా చూపారు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడం లేదు. జగన్ రాబోయే రోజుల్లో అయినా ప్రజల్లోకి రావడంపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది. ఏపీలో వైసీపీ ఎక్కువ స్థానాలలో విజయం సాధించాలంటే మాత్రం జగన్ కష్టపడక తప్పదు.