(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)
ప్రకాశం జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ భలే ఇరుకున పడింది. అక్కడ పార్టీలో ఐక్యత లేదు. సీనియర్ నాయకుడు, జగన్ కు బంధువులు అయినా, మాజీ మంత్రి బాలినేని వర్గం, వైఎస్ తోడల్లుడు, ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య పోరు నడుస్తూ ఉంది. రెండు వర్గాలు జిల్లాలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. అసలే ఐక్యత కరువయి ఇబ్బంది పడుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన పార్టీలో కంపరం పట్టించింది. ఈ మధ్య ముఖ్యమంత్రి ఒంగోలులో ధర్మ పోరాట దీక్షలోపాల్గొన్నారు. ఆసందర్భంగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే… వెలుగొండ ప్రాజక్టు నుంచి వచ్చే సంక్రాంతికల్లా నీరందిస్తామని అన్నారు.
మొదటి టనెల్ పనులు ను వేగంగా పూర్తిచేసి వచ్చే సంక్రాంతికల్లా నీరిస్తామని ప్రటకించారు. సంక్రాంతికి నీరిస్తే ఏమవుతుంది. ఆ నీరు జిల్లాలో వైసిసి బలంగా ఉంటుందనుకున్న ప్రాంతాల్లోకి పారుతుంది. అందునా ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయనంగా ఈ నీటిని విడుదల చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నీళ్లొస్తాయని , చంద్రబాబు చెప్పిన పని చేస్తాడని వైసిపికి కూడా తెలుసు. ఈ నీళ్లెవరికి వస్తాయి, వైసిపి బలంగా ఉందని చెప్పుకుంటున్న మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాలే మొదట లబ్ది పొందేది.
ఈ ప్రకటన రావడంతో వైసిపి అప్రమత్తమయింది. వెంటనే, వెలిగొండ పనులు వేగవంతం చేయాలని, ప్రాజక్టు ను తొందరగా పూర్తి చేయాలని వైసిపి నేత వైవిసుబ్బారెడ్డి కనిగిరి నుంచి వెలిగొండ వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. తమ వత్తిడి వల్లే ప్రభుత్వం ఇపుడు ప్రాజక్టుపనులను తొందరగా పూర్తి చేసేందుకు పూనుకుందని ప్రకటనలు చేశారు. ఇంతవరకుబాగానేఉంది. అయితే మొదటి టనెల్ నిజంగా పూర్తయితే, ప్రజలు నీళ్లను చూస్తారు గాని, వైవి సుబ్బారెడ్డి ప్రకటనను కాదుగా…అందుకే , జిల్లాలో 2019 ఎన్నికల్లో పట్టు సంపాదించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తు ఉందని చెబుతున్నారు.
అదేమిటో తెలుసా? 2019 ఎన్నికల్లో జగన్ చెల్లెలు షర్మిలను నిలబెట్టాలన్నది చంద్రబాబు నాయుడి వెలిగొండ ప్రాజక్టుకు కౌంటర్ వ్యూహం. దీని వల్ల చాలాప్రయోజనాలున్నాయి. ఒకటి, షర్మిలను నిలబెట్టినందున బాలినేని, వైవి సుబారెడ్డి గొడవతప్పుతుంది. షర్మిలను నిలబెడితే, ఇద్దరు విబేధాలు విస్మరించి ఆమె కోసం పని చేయాల్సి వస్తుంది. షర్మిల ఇంతవరకు ఎన్నికల్లో ఫోటీ చేయలేదు. ఇది మొదటిసారి అవుతుంది. షర్మిల అభ్యర్థి అయితే, జిల్లాలో పార్టీ లోకొత్త ఉత్సాహం వస్తుంది. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాళెంతో పాటు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరిప్రాంతాల్లో కూడా ఆమె ప్రభావం పడుతుందిని పార్టీ నాయకులు భావిస్తున్నారట. చంద్రబాబు నాయుడు ఎన్నికల కోసం వెలిగొండ టనెల్ పూర్తి చేసి నీళ్లను విడుదలేస్తే, జగన్ సోదరి షర్మిలను ఎన్నికల్లో నిలబెట్టి ఆ వ్యవూహాన్ని చిత్త చేస్తారని జిల్లా వైసిపిలో చర్చనడుస్తూ ఉంది. ఏమవుతుందో చూడాలి.
అయితే ఇటీవల ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో సీఎం చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే.. అదీ వైసీపీ బలం ఉన్న ప్రాంతాలను సస్యశ్యామలం చేసే వెలుగొండ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. మొదటి టన్నెల్ పనులు వేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికల్లా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.