AP: వైఎస్ఆర్సిపి సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అనే విషయం అందరికీ చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఈయన ఇదివరకు ఎప్పుడు కూడా రాజకీయాల నుంచి తప్పకుంటా అనే మాట ఎక్కడ మాట్లాడలేదు అలాంటి వ్యక్తి రాజకీయాలకు గుడ్ బాయ్ చెబుతూ తన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయించుకున్నారు అదేవిధంగా వైకాపా పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇలా విజయసాయిరెడ్డి ఉన్నఫలంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి నిజంగానే ఈయన రాజకీయాలకు దూరం అవుతూ ఆయన చెప్పినట్టుగానే వ్యవసాయం చేసుకుంటారా లేకపోతే ఈయన రాజీనామా వెనక జగన్ వ్యూహం ఉందా అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు తన కుటుంబంతో కలిసి లండన్ లో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి తన రాజీనామా విషయాన్నీ తెలియచేసే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు.
అయితే ఇలా రాజీనామా చేయడం వెనుక జగన్ హస్తం ఉందని తెలుస్తోంది. గతంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తనకెంతో సన్నిహితులైనటువంటి సుజనా చౌదరి రమేష్ బాబు వంటి నేతలను పార్టీ నుంచి రాజీనామా చేయించి బిజెపిలోకి పంపించారు. ఆ సమయంలో చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు.
ప్రస్తుతం కూడా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉంటూ తనకి ఎంతో సన్నిహితుడు అయినటువంటి విజయసాయిరెడ్డిని రాజీనామా చేయించారు. ఈ రాజీనామా ఈయన ఒక్కరితో ఆగదని మరి కొంతమంది ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు అని స్పష్టమవుతుంది. ఇలా రాజీనామా చేసిన వారందరూ కూడా బిజెపి పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఇప్పుడు విజయసాయిరెడ్డి, రాజీనామా చేస్తే ఆ సీటు ఖచ్చితంగా కూటమి ఖాతాలోకి పోతుంది. అయినా ఆయన రాజీనామా చేస్తున్నారంటే.. అంతర్గతం తీసుకున్న నిర్ణయం మేరకు తీసుకున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు తన పార్టీని కాపాడుకోవడం కోసమే తనకు ఎంతో సన్నిహితులైనటువంటి పలువురు ఎంపీల చేత రాజీనామా చేయించారు ఇప్పుడు జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారని తెలుస్తుంది.