ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉగ్ర రూంపం దాల్చడంతో పరిస్థితులు కూడా చేయిదాటిపోతున్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పటిష్టంగా వ్యవరించినా కేసులు..మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు ప్రయివేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు తుంగలొకి తొక్క అడ్డగోలుగా ఫీజులు వసూల్ చేస్తున్నాయి. వైద్యం సహా కరోనా పరీక్షలు కూడా ప్రయివేటు ల్యాబుల కు ఇచ్చేయడంతో దోపిడి మరింత ఎక్కువైంది. ఒక్కో కార్పోరేట్ ఆసుపత్రి లక్షల్లో దోచేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే సరైన వైద్యం అందదేమోనన్న భయంతో చాలా మంది ప్రయివేటు ఆసుపత్రుల వెంట పడటంతో ఇదే అదునుగా యాజమాన్యాలు ఫీజులు బాదేస్తున్నాయి.
ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ఆసుపత్రులను హెచ్చరించినా పట్టించకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో నేరుగా జగన్ మోహన్ రెడ్డికి ప్రజల నుంచే అభ్యర్ధనలు వెళ్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడి…ప్రభుత్వ ఆసుపత్రుల వైనాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం విషయం నేరుగా ఆయనకు చేరుతోంది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రయివేటు ఆసుపత్రులపై కఠిన చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అధికంగా ఫీజలు వసూల్ చేసినా..కరోనా అనుమానంతో ఇతర రోగాలతో బాధపడుతోన్న వారిని ఆసుపత్రిలో చేర్చుకోకపోయినా ఆసుపత్రుల అనుమతి రద్దు దిశగా చర్యలకు సిద్దం అవుతున్నారుట.
ఆ సుపత్రుల వెనుక ఎంతటి వారున్నా..ఎవర్నీ వదిలి పెట్టేది లేదని సీరియస్ యాక్షన్ కు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇలాంటి చర్యలను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని..మానవ హత్యగా భావించాల్సిందేనని అంటున్నారు. అనుమతులు లేని కోవిడ్ సెంటర్లు…క్వారంటైన్ సెంటర్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా 10 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది.