కర్నూలుకు జగన్ అన్యాయం చేస్తున్నారా.. జగన్ చేస్తున్న తప్పు ఇదేనా?

jagan (1)

ఏపీ సీఎం వైఎస్ జగన్ కర్నూలుకు అన్యాయం చేస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి కర్నూలు రాజధాని కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఆ హోదాను కోల్పోయింది. సీఎం జగన్ కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించగా ఆ ప్రకటన సీమవాసులను సంతోషానికి గురి చేసింది. అయితే ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. న్యాయ రాజధాని విషయంలో కూడా ఏపీకి అన్యాయం జరుగుతోంది.

అయితే జగన్ సర్కార్ కేఆర్ఎంబీని విశాఖకు తరలించే దిశగా అడుగులు వేస్తుండటం కర్నూలు ప్రజలను మరింత బాధ పెడుతోంది. జగన్ సర్కార్ ఎందుకు ఈ విధంగా చేస్తుందో అర్థం కావడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. విశాఖకు కృష్ణా బోర్డుకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా జగన్ సర్కార్ తీరు ఏ మాత్రం మారడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యమకారులు రాయలసీమ ప్రయోజనాల కోసం ధర్మ దీక్షలు చేస్తుండగా ఫలితాలు మాత్రం భిన్నంగా వస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. కర్నూలు విషయంలో జగన్ సర్కార్ తప్పటడుగులు వేయకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. జగన్ సర్కార్ రాబోయే రోజుల్లో ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది.

కర్నూలు విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో కర్నూలులో పూర్తిస్థాయిలో అనుకూలంగా ఫలితాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీరు మారకపోతే ఫలితాల విషయంలో మార్పు తప్పదు.