లోకేష్ బాబు విదేశాలలో విద్యాబ్యాసం చేసి వచ్చి ,తాత గారు మరియు తండ్రి గారి అడుగు జాడల్లో నడవాలని రాజకీయంలోకి వచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాన్న గారు మంత్రి పదవి కట్టబెట్టి సైకిల్ మీద దూసుకెళ్ళిపోమన్నారు. కానీ తొక్కడం రాక లోకేష్ బాబు ముందుకి వెనకకి అన్నట్టుగా ఉండిపోయారు. అధికారం లో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో మంత్రి పదవిలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్న లోకేష్ బాబు స్టేజి మీద మైక్ పట్టుకుని ఉద్వేగంతో ప్రసంగాలు చేద్దామనే హడావిడిలోనో లేక భాష మీద పట్టులేకనేమో గాని, చాలా….. చిన్ని చిన్ని తప్పులు మాట్లాడేసేవారు. ఆ తప్పులని పట్టుకుని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ వారు భలేగా ఆటాడుకునేవారు.
అయితే తొందరపడి ఛాన్స్ వచ్చిందని ఎవరూ ఎవర్ని అనకూడదు అని పెద్దలు ఊరికే అనలేదేమో … అప్పుడు లోకేష్ లానే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కూడా చాలా చక్కగా నేనేమి తక్కువ కాదన్నట్లుగా ఒక ప్రసంగం చేసి … టీడీపీ వారికి దొరికిపోయారు , అసలే అవమానాలు పడి ఉన్న మనుషులు కదా! వీరి ప్రతాపం చూయిస్తున్నారు.
ఆదివారం సీఎం జగన్ చేసిన ప్రసంగంలోని తెలుగు తప్పులను వెతికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ‘ఏం భాష స్వామి అది!’ అంటూ వీడియో విడుదల చేశారు. అనంతరం టీడీపీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు ఓ రేంజ్‌లో సీఎం జగన్‌పై ట్రోలింగ్ చేపట్టారు.
ఏం భాష స్వామి అది! pic.twitter.com/jpmHTC31rN
— Kinjarapu Atchannaidu (@katchannaidu) November 1, 2020
ఇక వైసీపీ ప్రభుత్వం మరియు సీఎం జగన్ మీద సందర్భం లేకుండానే వేసుకునే “ABN ఛానల్” వారు పండుగ చేసుకుంటున్నారు. సీఎం ప్రసంగం వీడియోకి “అన్న మాట్లాడేది అచ్చ తెలుగు.. 🤣” అనే టైటిల్ పెట్టి వైరల్ చేసేసారు. వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు చేసేదేం లేక చూస్తూ ఉండిపోయారు.