ఈ మధ్య కాలంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ కామెంట్ల ద్వారా సంచలనాలు సృష్టిస్తూ వాటితోనే పబ్బం గడుపుతున్నారు. అయితే.. వీటిని సీఎం జగన్ కానీ, పార్టీ అధిష్టానం కానీ ఎక్కడా ఆపకపోవటంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఏం ఆలోచన చేసిందో కాని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కులాలను టార్గెట్ చేయడం మానేసి…వ్యక్తులను, ప్రత్యర్థులను, ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేతను ఎంత టార్గెట్ చేస్తే అంత గుర్తింపు అనే ధోరణి వైసీపీలో కనిపిస్తోంది. అయితే మళ్లీ పార్టీ లైన్‌కు భిన్నంగా తొలిసారి అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కులాలను టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా రెడ్లు, కమ్మలు దౌర్జన్యాలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక జారీ చేశారు.
ఎంపీ గారు తన మనసులో జేసీ దివాకర్‌రెడ్డి, పరిటాల రవి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రెడ్డి, కమ్మ వర్గాలను దూషిస్తున్నారట.సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం వల్ల పార్టీ నష్టపోతుందని పదే పదే చెబుతున్నా ఎంపీ స్థాయిలో ఉన్న మాధవ్ ఇలా గాడి తప్పడం కులాలను టార్గెట్ చేయడం సరికాదని జగన్ భావిస్తున్నారని, ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పిలిచి తలంటేందుకు ఆయన సమాయత్తమయ్యారని అంటున్నారు. ఈ విషయం మీద తాజాగా జగన్ నుంచి ఆయనకు సమన్లు అందినట్టు పార్టీలో అత్యంత గోప్యంగా చర్చ సాగుతోంది.ఈ ఎంపీ గతంలో కూడా కియా ప్లాంట్ వద్ద నానా హడావిడి చేసి విమర్శల పాలవ్వడంతో అప్పుడే పార్టీ అధిష్టానం నుంచి క్లాస్ పడింది. మరల ఇప్పుడు మరోసారి క్లాస్ పడితేనే లైన్ లో ఉంటారని జగన్ భావిస్తున్నారట.