జగనా, ఈ వయసులోనే ఇన్ని అబద్దాలా: ఆశ్చర్యపోయిన ఆదినారాయణ రెడ్డి

 

కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి జగన్ మీద చిందులేశారు. తీవ్రంగా విమర్శించారు. ఇంత వయసులో ఇన్ని అబద్దాలేందిరా నాయనా అని ఆశ్చర్యం పోయారు. ఈ రోజు ఆయన విజయవాడంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ రాజా ఆఫ్ కరప్షన్ అని  రాజా ఆఫ్ కరెప్షన్, అవినీతి చక్రవర్తి 6లక్షల 17 వేల కోట్లు జరిగిందని ఆరోపించారు.జగన్  ఆరోజుల్లోనే బాగా అవినీతి కి పాల్పడినట్లు రుజువు కూడా అయ్యిందని అన్నారు. 

‘హైదరాబాదు, బెంగుళూరు లో భవనాలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో చెప్పాలి. జగన్ చాలా గొప్పవాడు.. అంత ధర్మపరుడులా చిలక పలుకులు పలుకుతున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్మునే ఈడి జప్తు చేసింది. బడ్జెట్ ను కూడా మించిపోయి చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు చెప్పడం ‌హాస్యాస్పదం. రైతులు స్వచ్చందంగా భూములు ఇస్తే..‌దానిని కూడా రాజకీయం చేస్తున్నారు,’ అని అన్నారు.

ఇంత చిన్న వయసులో అబద్దాలా అంటూ జగన్ అబద్దాలు చక్రవర్తి అని వర్ణించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి ఇంకా ఏమన్నారంటే, 

‘పులివెందుల నియోజకవర్గం లో పరిశీలిస్తే ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో జగన్ కు తెలుస్తుంది. నిపుణులు, ఇంజనీర్లు, ఇతర రాష్ట్రాల నేతలు పోలవరం ను మెచ్చుకున్నారు.  మంచిని నువ్వు ఒప్పుకోవు.. నీ దరిద్రం ఎపి ప్రజలకు రుద్ద వద్దు. చంద్రబాబుకు కేసిఆర్ రిటర్న్ గిప్ట్ఇస్తానంటే.. సిగ్గు లేకుండా ఒత్తాసు పలుకుతున్నావు

చంద్రబాబు తెలంగాణ లో ధైర్యంగా పోటీ చేశారు.. నువ్వు కాడి వదిలేసి కేసిఆర్ తో చీకటి ఒప్పందం చేసుకున్నావు.జయప్రకాష్ నారాయణ కూడా కేంద్రం ఇవ్వాల్సిన లెక్కలు ప్రకటించారు.మోడి మోసం‌ చేసినా.. నిధులు ఇవ్వక పోయినా.. విమర్శించలేవు, అంత ధైర్యం నీకు లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రభుత్వం పై రాళ్లు వేయడమే జగన్ పని. ఎప్పుడూ లక్ష కోట్ల రూపాయల అవినీతేనా..మహాత్మాగాంధీ, అల్లా, జీసెస్, గౌతమ బుద్ధుడు వంటి మహాను భావులకన్నా జగన్ గొప్పోడని భావించుకుంటాడు. వైసిపి ని ఎందుకు‌ వీడాల్సి వచ్చిందో.. చెప్పాం..‌ జగన్ కు నన్ను రాజీనామా అడిగే అర్హత లేదు

పాదయాత్ర లు చాలా మంది చేశారు కానీ… ఇటువంటి బ్రేక్ ల తో యాత్ర ఎవరూ చేయలేదు.కోడి కత్తి విషయంలో అందరికీ దండం పెట్టుకుంటూ వెళ్లి గవర్నర్ కు మా పై ఫిర్యాదు చేశారు.జాతీయ దర్యాప్తు సంస్థకు కేసు ఇవ్వడంలో మాకు అభ్యంతరం లేదు..‌ ఇచ్చిన విధానాన్ని మేము తప్పు పడుతున్నాం

తొడు రావాల్సిన బిజెపి తోడేలుగా మారడం వల్ల టిడిపి దూరమైంది. జగన్ కేసుల నుంచి తప్పుకునేందుకు బిజెపి లో దూరి దూరి తిరుగుతున్నారు. మంచిని మైకులో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలి‌ అని మన పెద్దలు అన్నారు. ఇది జగన్ గుర్తుంచుకోవాలి.