వాళ్ళిద్దరి విషయం చాలా చాలా ఈగో గా తీసుకున్న జగన్ ?

2021 ఓటర్ల జాబితాను ప్రచురించని పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌లపై ఎస్‌ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చాలా తీవ్రమైనవి కాపాడటంతో ప్రభుత్వం వారిని కాపాడటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఐఏఎస్ అధికారి చరిత్రలో సెన్సూస్ ప్రొసిడింగ్స్ ఎదుర్కొంటే తర్వాత ఎలాంటి పదొన్నతులూ ఉండవు. పైగా ప్రభుత్వం చెప్పినట్లుగా చేసినందున వారు ఈ చర్యలు ఎదుర్కొంటున్నంందున వారిని కాపాడకపోతే, ఇతర అధికారులు తమ ఆదేశాలను పట్టించుకోరన్న ఆందోళనలో ప్రభుత్వం పడిపోయింది.

cm jagan mohan reddy n
cm jagan mohan reddy 

అందుకే, ఆ ఇద్దరు అధికారులపై ప్రొసీడింగ్స్‌ను చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, మళ్లీ నిమ్మగడ్డకు తిరిగి పంపారు. ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఈసీకి లేదని ఆయన చెప్పుకొచ్చారు. వారిద్దరికి మద్దతుగా ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం చెప్పినట్లుగా చేసిన ఇద్దరు అధికారులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్యాక్షనిస్ట్ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష పూరితంగా చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ బ్యూరో క్రాట్‌గా ఉండి, అధికారులపై ఆయన చర్యలు తీసుకోవడం ఏమిటని ఆశ్చర్యపోయారు.

ఆ తర్వాత కాసేపటికే నిమ్మగడ్డ కూడా మీడియాతో మాట్లాడారు. తాను కక్ష పూరితంగా ఎవరిపై చర్యలు తీసుకోలేదని, విధులు నిర్వర్తించలేదనే చర్యలు తీసుకున్నానని స్పష్టం చేశారు. అది వారికే మంచిదన్నారు. ద్వివేదీని, గిరిజాశంకర్ ను బదిలీ చేయమని ఆదేశించలేదని. వారు విధుల్లో ఉన్నారన్నారు. ఉదయం వీడియో కాన్ఫరెన్స్ గిరిజాశంకర్ నేతృత్వంలోనే జరిగిందని చెప్పారు. మొత్తానికి ఎస్‌ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్… ఐఏఎస్ అధికారుల్లో కలకలం రేపాయి. ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తే తమ పరిస్థితి అదేనా అని ఆందోళనలో చాలా మందిపడ్డారు. ఈ భయాన్ని తగ్గించడానికి ఆ ఇద్దరు అధికారులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ అసలు సర్వీసు వ్యవహారాలు చూసేది డీవోపీటీ కావడంతో అక్కడ నమోదైతే.. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు.