ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ నేతలు మరోవైపు ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం హయంలో టీడీపీ నేతలు చేసిన అవినీతిని బయటపెడుతుండడంతో సహనం కోల్పోయిన టీడీపీ నేతలు సభా కార్యక్రమానికి పదే పడే అడ్డుపడ్డారు. స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వరుసగా రెండో రోజు కూడా తెలుగు తమ్ముళ్ళు సభకు అడ్డుతగులుతుండడంతో చంద్రబాబుతో సహా 15 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేశారు.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై పలు ఆరోపణలు చేసిన చంద్రబాబు అండ్ బ్యాచ్ బండారం బయటపెట్టారు జగన్. 40 ఇయర్స్ చంద్రబాబు అవినీతి పై అసెంబ్లీలో ఏకంగా షో వేసి మరీ చూపించారు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యిందని చెప్పిన జగన్, రైతులకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సీడీకి సంబంధించి గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు జగన్.
2014 సంవత్సరంలో కరీఫ్ సీజన్‌లో నష్టం జరిగితే రైతులకు ఇచ్చే సొమ్ము 2015లో 692 కోట్లు ఇచ్చారని, ఆ తర్వాత 2015 కరీఫ్ సీజన్‌లో నష్టం జరిగితే ఇన్సూరెన్స్ సొమ్ము 2017లో అంటే రెండు సవంత్సరాల తర్వాత ఇచ్చారని, 2016లో రబీ సీజన్‌లో నష్టం జరిగినే 2017లో ఇచ్చారని, 2018 ఇన్‌పుట్ సబ్సీడీని అయితే పూర్తిగా ఎగ్గొట్టేశారని జగన్ తెలిపారు. 2018 కరీఫ్‌లో 1838 కోట్లు, అదే సంవత్సరం రబీ సీజన్‌కు సంబంధించి 356 కోట్లు పూర్తిగా 2196 కోట్లు ఎగ్గొట్టారన్నారు.
ఇలాంటి అవినీతి ఎల్లో బ్యాచ్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హాయాంలో రెతులకోసం యుద్ధ ప్రాతిపధికన అనేక చర్యలు తీసుకుంటూ, ఇన్‌పుట్ సబ్సీడీ ఏ సీజన్‌కు సంబంధించి వెంటనే ఇస్తూ, అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటుంటే, వైసీపీ ప్రభుత్వం పై దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్ విషయంలో టీడీపీ చేసిన మాయాజాల్ని బయటపెట్టిన జగన్, రైతుల కోసం రోడ్డెక్కిన చరిత్ర తనదైతే, రైతుల ఉద్ధారకుడి ముసుగులో వారికి ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకుండా అవినీతి చేసిన చరిత్ర చంద్రబాబుది అసెంబ్లీ సాక్షిగా షో వేసి మరీ చూపించారు జగన్.