సీఎం జగన్ లో భయం పెరుగుతోందా.. ఈ నిర్ణయాల వెనుక కారణాలివేనా?

YS_Jagan_Mohan_Reddy__India_To

ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ, జనసేన విషయంలో భయపడుతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు షాకిచ్చేలా జగన్ తరచూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం వెనుక అసలు కారణం ఇదేనని సమాచారం అందుతోంది. ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా మరో ఐదేళ్లు అధికారానికి దూరం కావాల్సి ఉంటుందని జగన్ భావిస్తున్నారని బోగట్టా. రిస్క్ తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని జగన్ ఫీలవుతున్నారని సమాచారం.

తాజాగా హోం శాఖ నుంచి ఆదేశాలు రావడం వైసీపీకి ప్రయోజనం చేకూర్చినా రాబోయే రోజుల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పవు. 2024లో మరో పార్టీ అధికారంలోకి వచ్చి ఇవే నిబంధనలను అమలు చేస్తే మాత్రం వైసీపీ ఏ స్థాయిలో నష్టపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. భవిష్యత్తును గుర్తుంచుకుని జగన్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

జగన్ కు పోటీనిచ్చే స్థాయి లోకేశ్ కు లేకపోయినా చంద్రబాబు మాస్టర్ మైండ్ ను తక్కువగా అంచనా వేయలేము. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆయన ప్రజల మద్దతును సొంతం చేసుకోవడంతో పాటు పార్టీని గెలిపించుకున్నారు. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే 2024 ఎన్నికల్లో కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుంది.

చంద్రబాబుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కూడా సపోర్ట్ కూడా ఉంటే రాజకీయాల్లో సంచలన మార్పులు రావడం గ్యారంటీ అని కొంతమంది చెబుతున్నారు. ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఏపీ రాజకీయాలలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.