జర భద్రం: మీకూ వర్తిస్తుంది జనసేనానీ.!

Pawan Kalyan

నిన్నటిదాకా తిట్టినవారు, ఒక్కసారిగా పొగడటం ప్రారంభిస్తారట. ఎవరో అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని సరికొత్తగా పొగడటం ప్రారంభించే, నిన్నటి శతృవులు.! ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంచెం స్పష్టత ఇచ్చి వుంటే బావుండేది.

ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ని దారుణంగా విమర్శించేది వైసీపీ మాత్రమే. ఆ వైసీపీ ఎలాగూ పవన్ కళ్యాణ్‌ని పొగిడే పని పెట్టుకోదు. ఒకవేళ పవన్ కళ్యాణ్‌ని వైసీపీ పొగడాలంటే, వైసీపీని ముందుగా పవన్ కళ్యాణ్ పొగడాల్సి వుంటుంది.

వైసీపీని పొగడటం కోసం జనసేనాని మానసికంగా సిద్ధమైతే మాత్రం, రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్‌ని మనం చూడాల్సి వస్తుంది.

ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ‘అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే..’ అని.

అక్కడితో ఆగలేదు, (అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి.) అంటూ ముగించారు జనసేనాని.

ఇంతకీ ఏం జరుగుతోందబ్బా.? నిజానికి, ఇలాంటి వ్యవహారాలో పవన్ కళ్యాణ్ చాలా ఆరి తేరిపోయారు. బీజేపీని విమర్శించారు, పొగుడుతున్నారు. టీడీపీని పొగిడారు, విమర్శిస్తున్నారు. మళ్ళీ పొగుడుతారేమో కూడా. జర భద్రం జనసైనికులూ.. అనాల్సి వస్తుందిప్పుడు.!