ఏడాది కాలంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోర్టుల్లో భంగపాటు తప్పలేదు. ఏ కేసు వేసినా….కేసు ఎలాంటిదైనా తీర్పు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుంది తప్ప! ప్రభుత్వానికి అనుకూలంగా లేదు అనడానికి ఎన్నో కేసులను ఉదహరించ వచ్చు. ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావొచ్చు.. రాజధానుల వివాదం కావొచ్చు.. డాక్టర్ సుధార్ కర్ కేసు కావొచ్చు….రంగుల కేసు కావొచ్చు…. దాడుల కేసులు కావొచ్చు..కారణం ఏదైనా..తప్పు ఎక్కడ జరిగినా? తిరగొచ్చి జగన్ మెడకే చుట్టుకుంటుంది. సవాల్ కు వెళ్లిన సుప్రీం కోర్టుల తీర్పుల్లో సైతం ఇదే వైనం కనిపిస్తోంది.
తాజాగా విశాఖలో 30 ఎకరాల భూమికి సంబంధించి ఏపీ హైకోర్టు విచారణలో భాగంగా భూ కేటాయింపులు చేపట్టొద్దని ఆదేశించింది. కానీ గంట సమయంలోనే ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి నుంచి జీవో వచ్చేసింది. విశాఖ లో గెస్ట్ హౌస్ కోసం ఈ జీవో ఇచ్చారు. మరి ఈ జీవో సీఎం అనుమతితో వచ్చిందా? లేక మరో రకంగా వెలువడిందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సలహాలు ఇచ్చే వాళ్లు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నది ఓ కారణంగా వినిపిస్తోంది. మరి అసలు తప్పు ఎక్కడ జరుగుతుందంటే? సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై సీరియస్ గా థింక్ చేయాల్సిందేనంటున్నారు.
జగన్ సొంత నిర్ణయాలా తప్పిదమా? అధికారుల సొంత నిర్ణయాలు కారణమా? అన్నది విశ్లేషించుకుని ప‌్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు న్యాయస్థానం ముందు బలంగా ఉండాలి…నిలబడాలి..వాదనలు అంతే బలంగా ఉండాలి. ప్రభుత్వం వేస్తోన్న పిటీషన్లు కూడా స్ర్టాంగ్ గా ఉండటం లేదన్నది కొంత మంది వాదన. అయితే ఇప్పటికే జగన్ న్యాయ పరమైన సలహాలు విషయంలో, క్రింది స్థాయి అధికారుల విషయంలో ప్రక్షాళన చేపట్టారు. కానీ తప్పులు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరి కోర్టుల్లో నెగ్గి జగన్ ఎప్పుడు శెభాష్ అనిపిస్తారో.