పదొచ్చినా పండగే.! జనసేనలో ఇదే చర్చ జరుగుతోందా.?

ఎవరు చేశారో తెలియదుగానీ, ఓ సర్వే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీకి వచ్చే సీట్లు నాలుగు నుంచి ఎనిమిది వరకూ వుండొచ్చని ఆ సర్వే చెబుతోంది.

దాదాపు 8 నుంచి 9 శాతం మాత్రమే ఓటు బ్యాంకు జనసేనకు వస్తుందనీ ఆ సర్వే అంచనా వేస్తోంది. టీడీపీ అధికారంలోకి రాబోతోందనీ, వైసీపీ అధికారం కోల్పోతుందని కూడా ఆ సర్వే అంచనా వేసింది. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం రెండు నుంచి మూడు శాతమే వుంటుందట.

ఒకవేళ జనసేన – టీడీపీ కలిస్తేనో.? రాజకీయాల్లో ఒకటీ ప్లస్ ఒకటి.. ఒక్కోసారి జీరో కూడా అవ్వొచ్చు. లేదంటే మూడు కూడా అవ్వొచ్చు. అదే రాజకీయం. సో, జనసేన – టీడీపీ కలిస్తే, అడ్వాంటేజ్ అని పూర్తిగా అనేసుకోవడానికి వీల్లేదు.

ఒక్కటి మాత్రం నిజం.. టీడీపీ – జనసేన కలిస్తే, అడ్వాంటేజ్ జనసేనకు ఖచ్చితంగా వుంటుంది. అదీ జనసేన గెలిచే సీట్లు, టీడీపీ గనుక పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే. కాని పక్షంలో రెండు పార్టీలూ నష్టపోయి, వైసీపీ లాభపడుతుంది.

కాగా, సొంతంగా పోటీ చేసినా 4 నుంచి 8 సీట్లు గెలుస్తామని సర్వేలు చెబుతున్న దరిమిలా, కాస్త కష్టపడితే, ఆ సీట్ల సంఖ్యను డబుల్ లేదా ట్రిపుల్ చేసుకోవచ్చని జనసేన శ్రేణులు భావిస్తున్నాయట.

సోలోగా వెళ్ళి పది సీట్లు గెలుచుకున్న అది ఆత్మగౌరవమే అవుతుందని జనసేనాని కూడా భావిస్తున్నారట.