మెరుగైన ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ ప్రయత్నమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలజడి సృష్టించారు. ఆయన ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా, ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయి. అధికార పార్టీలో అలజడి, ప్రతిపక్షంలో ప్రకంపనలు.. ఇవన్నీ సర్వసాధారణమే అయిపోయాయి.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బలం చాలా చాలా తక్కువని తేలిపోయింది. పోటీ చేసిన రెండు చోట్లా జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎప్పుడో వైసీపీలో చేరిపోయారు. అయినాగానీ, పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఏపీ రాజకీయాలు నడవడం లేదు.

ఇదంతా ప్యాకేజీ ప్రభావమేనని అధికార వైసీపీ తరచూ విమర్శిస్తుంటుంది. ఇప్పుడు కూడా మెరుగైన ప్యాకేజీ కోసమే జనసేన అధినేత, మూడు ఆప్షన్స్.. అంటూ పొలిటికల్ హడావిడి షురూ చేశారన్నది వైసీపీ ఆరోపణ. సరే, వైసీపీ ఆరోపిస్తున్నట్లు పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి ప్యాకేజీ తీసుకుంటున్నారనే అనుకుందాం. కానీ, ఆ ప్యాకేజీ కంటే సినిమాల్లో పవన్ కళ్యాణ్‌కి వచ్చేది చాలా చాలా ఎక్కువ కదా.? పవన్ కళ్యాణ్‌కి అంతకు మించిన ప్యాకేజీని వైసీపీ ఆఫర్ చేయొచ్చు కదా.? ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తాయ్.

పవన్ కళ్యాణ్ గనుక ప్యాకేజీ వైపు ఎట్రాక్ట్ అయితే, బీజేపీనే పెద్ద ప్యాకేజ్ అనౌన్స్ చేసేసి వుండేది. కానీ, అలా జరగడంలేదాయె. సరే, ఎవరి వాదనలు ఎలా వున్నాగానీ, పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాల విషయమై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. నిఖార్సయిన రాజకీయ నాయకుడిగా జనంలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళాలి. కానీ, వెళ్ళడంలేదాయె.!

పవన్ కళ్యాణ్ ఏపీకి వచ్చి వెళ్ళిన ప్రతిసారీ, టీడీపీ అనుకూల మీడియా ఆయనకు ఇచ్చే ఎలివేషన్స్ వల్లనే, పవన్ టీడీపీ నుంచి ప్యాకేజీ తీసుకున్నారన్న విమర్శలకు బలం చేకూరుతోంది