జాతి మీడియా చుట్టూ ఉచ్చు బిగుస్తోందా ?

మీడియా మ్యానేజ్ మెంట్ లో చంద్రబాబునాయుడును మించినోడు లేడన్న విషయం అందరికీ తెలిసిందే. విషయం ఏదైనా, చంద్రబాబు ఎంత కంపు చేసినా జాతి మీడియా అడ్డంగా వెనకేసుకొచ్చిన విషయం కూడా అందరూ చూసిందే. చంద్రబాబును వెనకేసుకు రావటం ఒక ఎత్తైతే, చంద్రబాబు కోసమే జగన్మోహ న్ రెడ్డిపై బురద చల్లటం మరో ఎత్తు.

గడచిన ఐదేళ్ళు చంద్రబాబు కోసమే జగన్ పై జాతి మీడియా ఎంత బురద చల్లిందో అందరికీ తెలిసిందే. అలాంటి మీడియాకు జగన్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఢిల్లీలో మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం, పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిటి వేస్తామన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ముందుగా కమీషన్  ముందుంచి సలహాలు తీసుకుంటామన్నారు. అలాంటి కమీషన్ పైన కూడా చంద్రబాబు మీడియా ఏదైనా బురద చల్లితే కచ్చితంగా వాటిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

చంద్రబాబు ఘోర పరాజయం మూటగట్టుకున్నారు కాబట్టి జాతి మీడియా కూడా కారణాలేవైనా జగన్ పై  వ్యతిరేకంగా రాయటం లేదు. నాలుగు రోజులు పోయినాక వాటి బుద్ధి మళ్ళీ వక్రంగానే పనిచేస్తుంది. ప్రతీ చిన్న పొరబాటును, తప్పిదాన్ని బూతద్దంలో చూపటం ఖాయం. దాంతో ప్రభుత్వానికి మీడియా మధ్య ఘర్షణ తప్పదు. అందుకనే ముందుగానే జగన్ జాతి మీడియాను హెచ్చరించినట్లున్నారు.

జగన్ హెచ్చరికను జాతి మీడియా లెక్కలోకి తీసుకోవటం దాదాపు అనుమానమే. ఎందుకంటే, సమాజ హితంకన్నా జాతి మీడియాకు చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని చాలా సందర్భాల్లో తేలిపోయింది. కాబట్టే జగన్ కూడా జాతి మీడియాను విశ్వాసంలోకి తీసుకోవటం లేదు. అందుకనే కమీషన్ అంటున్నారు జగన్. జగన్ నియమించబోయేది జ్యుడీషియల్ కమీషనే కాబట్టి తీసుకునే యాక్షన్ కూడా కమీషనే తీసుకుంటుందేమో చూడాలి.