మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళకు జగన్ షాక్: అసలు నిజం ఇదే…

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై గత కొన్ని రోజులుగా మీడియాలో ఒక ప్రచారం సాగుతోంది. జగన్ ఆయనకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆయన స్థానంలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావుకి టికెట్ ఇవ్వనున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ళ పనితీరుతో జగన్ అసంతృప్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆళ్ళ 12 ఓట్ల అతి స్వల్ప తేడాతో టిడిపి నేత గంజి చిరంజీవిపై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మంగళగిరిలో టిడిపి పైన గెలవడని సర్వేలో తేలడంతో ఆ సీటును ఆదిశేషగిరిరావుకు కేటాయించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు ఈ వార్తల్లో వాస్తవమెంత? నిజంగానే ఆళ్లపై జగన్ అసంతృప్తిగా ఉన్నారా? ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించనున్నారా? మంగళగిరిలో పార్టీని బలపరచడంలో ఆళ్ళ ఫెయిల్ అయ్యారా? ఆర్కే టిడిపి కి పోటీ ఇచ్చే బలమైన అభ్యర్థి కాలేకపోయారా? వీటన్నిటిని కొట్టి పారేస్తున్నాయి వైసీపీ వర్గాలు. అసలు ఆళ్లపై జరుగుతున్న ప్రచారం కేవలం టిడిపి పన్నిన కుట్ర అంటున్నాయి. ఆళ్ళ సన్నిహితులు చెబుతున్న విస్తుపోయే విషయాలు కింద ఉన్నాయి చదవండి.

ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై జగన్ కి మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఆళ్ళ స్థానంలో మరొకరిని నియమించే ఆలోచన చెయ్యట్లేదు. ఈసారి కూడా కచ్చితంగా ఆళ్ళకే టికెట్ ఇస్తారు. టిడిపి చేస్తున్న అక్రమాలను ఆర్కే ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇసుక మాఫియా, ముఖ్యమంత్రి అక్రమ నివాసం, రాజధాని భూసమీకరణ, ఓటుకు కోట్లు కేసు, సదావర్తి సత్రం భూముల ఇలా పలు వ్యవహారాలపై దాదాపు 20 కేసులు పెట్టి టిడిపి కి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనకు పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకపోవడంతో రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రత్యర్ధులు కుట్ర పన్ని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆళ్ళ సన్నిహితవర్గాల సమాచారం. ఇటీవలే ఆళ్ళ తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి అంటూ డిజిపి ఆర్ఫీ ఠాకూర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి బెదిరింపు కాల్స్ విపరీతంగా వస్తున్న తరుణంలో ఆయన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు లేఖ రాశారు. ఈ లేఖను మంగళవారం ఆయనే స్వయంగా డీజీపీకి అందించారు. ఈ లేఖలో ఆయనకు బెదిరింపు కాల్స్ విపరీతంగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు భద్రత పెంచాలంటూ ఆ లేఖలో ప్రతిపాదించారు.

అనేకమంది తనను టార్గెట్ చేశారంటూ ఆయన డీజీపీకి కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక విషయాన్నీ డీజీపీకి గుర్తు చేశారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకు గతంలో కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు. ఈ బెదిరింపులకు కారణం అక్రమాలకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటమే అని తెలిపారు. ముఖ్యమంత్రి అక్రమ నివాసం, రాజధాని భూసమీకరణ, ఓటుకు కోట్లు కేసు, సదవర్తి సత్రం భూముల వ్యవహారాలపై తాను న్యాయ పోరాటాలు చేస్తున్నాని తెలిపారు. ఈ తరుణంలోనే తనకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ అందిస్తోంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పలు న్యాయ పోరాటాల వలనే బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆర్కే చెబుతున్నారు. ఇసుక మాఫియా నుండి బెదిరింపు లేఖలు, హతమారుస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. మావోయిస్టుల పేరిట కూడా ఈమధ్య కాలంలో బెదిరింపు లేఖలు వస్తున్నాయని ఆర్కే అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన భద్రతను పెంచాలని, కనీసం 2 + 2 గన్ మెన్ సెక్యూరిటీ కల్పించాలని ఆయన డీజీపీకి అందించిన లేఖ ద్వారా కోరారు.