జగన్ వైఖరేంటో స్పష్టమైపోయిందా ?

ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియాలో వచ్చిన కథనంతో జాతీయ రాజకీయాల్లో తన స్టాండ్ ఏమిటో క్లియర్ చేసినట్లుగా ఉంది. కేంద్ర రాజకీయాల్లో జగన్ ఎటువైపు మొగ్గు చూపుతారు అనే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. దానికి సమాధానంగా అన్నట్లుగా జగన్ మీడియా సాక్షిలో బ్యానర్ గా ఓ కథనాన్ని అందించింది. జాతీయ రాజకీయాల్లో ఇదే జగన్ వైఖరి అన్నట్లుగా ఉంది.

ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏ 240 రన్ అవుట్ అన్నట్లుగా కథనం సాగింది. అలాగే యూపిఏ 150 ఆలౌట్ అని డార్క్ హార్స్ 150 నాటౌట్ అని కథనంలో చెప్పారు. ఎన్టీఏ, యూపిఏ కూటముల్లో ఎవరెరవరు ఉన్నారనే విషయంలో ఓ స్పష్టతుంది. కానీ డార్క్ హార్స్ అనేది మాత్రం ప్రస్తుతానికి ఓ బ్రహ్మపదార్ధమనే అనుకోవాలి.

 తెలంగాణా సిఎం కెసియార్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ కు ప్రత్యామ్నాయమే డార్క్ హార్స్ అని జగన్ మీడియా చెప్పిందేమో తెలీదు. ఎందుకంటే, ఫెడరల్ ఫ్రంట్ కూడా ప్రస్తుతానికి  ఊహజనితమే. ఈ ఫెడరల్ ఫ్రంట్ లో ప్రస్తుతానికి కెసియార్ తప్ప మరొకరు లేరు. రేపటి ఫలితాల తర్వాత ఎటువైపు మొగ్గుతారనే విషయంలో కెసియార్ ను కూడా నమ్మేందుకు లేదు.

కాబట్టే జగన్ మీడియా ముందుజాగ్రత్తగా ప్రత్యామ్నాయాన్ని డార్క్ హార్స్ అని పేర్కొన్నదనే అనిపిస్తోంది. బహుశా డార్క్ హార్స్ లో వైసిపి కూడా ఉందేమో. అయితే డార్క్ హార్స్ కు జగన్ మీడియా చెప్పినట్లుగా 150 వచ్చినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే పార్టీకైనా కూటమికైనా కనీసం 277 సీట్లు దాటాలి. సరే డార్క్ హార్సా లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ ఏమైనా కానీండి ఇప్పటికైతే జగన్ స్టాండ్ ఏమిటో క్లియర్ అయ్యిందనే అనుకోవాలి.