టిడిపికి బిగ్ షాక్: ఐటి నెక్స్ట్ టార్గెట్ టిడిపి ఎంపీ గల్లా జయదేవ్

టిడిపి కి బిగ్ షాక్ తగలనుందా? ఈ ఎఫెక్ట్ రాజధానిలో టిడిపి పై ప్రభావం చూపనుందా? రాజధానిలో టిడిపి బలహీనపడనుందా? అంటే అవుననే వినిపిస్తోంది. ఇప్పటికే ఐటి దాడులు టిడిపి నేతలను వణికిస్తున్నాయి. నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. టిడిపి నేతలు బీద మస్తానరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఆస్తులపై ఐటి సోదాలు నిర్వహించారు అధికారులు. ఇప్పటి వరకు ఐటి అధికారుల టార్గెట్ చూస్తే చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్నవారిపై, పార్లమెంటులో బిజెపి కి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపైనే జరిగాయి.

దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారా అని ఏపీలోనూ, తెలంగాణలోనూ హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఎంపీ గల్లా జయదేవ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన చెల్లించాల్సిన ట్యాక్స్ డిస్ప్యూట్స్ గురించి అధికారులకు ఆరోపణలు వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు గత పార్లమెంటులో బిజెపి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు బిజెపి కి వ్యతిరేకంగా గల్లా తన గళాన్ని గట్టిగ వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన స్పీచ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ వీడియో తెగ హల్ చల్ చేసింది.

అయితే బిజెపి గల్లా జయదేవ్ ను బలమైన ప్రత్యర్థిగా భావిస్తోందట. అందుకే ఆయనకు చెక్ పెట్టడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ గల్లా జయదేవ్ ఆస్తులపైనే ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. కాగా అదే నిజమైతే గల్లాకు రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆయనకు వివాదరహితుడిగా పేరుంది. డీసెంట్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉంది.

ఇప్పుడు గల్లా జయదేవ్ ఆస్తులపై సోదాలు నిర్వహిస్తే రాజధానిలో టిడిపి బలహీన పడుతోంది. ఎంపీ గల్లా జయదేవ్ లాంటి వ్యక్తిపైన ఐటి సోదాలు జరిగితే సామాన్య ఓటరుడు గల్లాపై అసంతృప్తి చెందే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ రాజధానిలో టిడిపి పై నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేయవచ్చు అనుకుంటున్నారు. ఎన్నికలు సమీపంలో ఉండటంతో ఓటు బ్యాంకుపైన దీని ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. టిడిపి కంచుకోటలో పరిణామాలు, సమీకరణాలు తారుమారవుతాయేమో వేచి చూడాల్సిందే…