అమిత్ షా తారక్ ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకున్నారో వాళ్లిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలియదు. అయితే వాళ్లిద్దరి మధ్య సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా చర్చ జరగడం మాత్రం వాస్తవమేననే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటనను అమిత్ షా మెచ్చుకోవడంతో పాటు రాజకీయాల్లోకి తారక్ ఎంట్రీ గురించి అమిత్ షా ప్రశ్నించినట్టు బోగట్టా.
తారక్ మాత్రం ప్రస్తుతం సినిమాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తానని రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి తనకు ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారని సమాచారం అందుతోంది. తారక్ బీజేపీకి డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం సాధ్యం కాదని పరోక్షంగా తన వంతు సహాయం చేస్తానని చెప్పి ఉండవచ్చని తెలుస్తోంది. తారక్ కు సొంతంగా టీడీపీ ఉంది. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో తారక్ టీడీపీలో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.
టీడీపీకి ఏపీలో భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు ముందు ఉన్న ఏకైక ఆప్షన్ కూడా తారక్ అనే సంగతి తెలిసిందే. మరోవైపు తారక్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఈ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన తర్వాతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
చంద్రబాబు పని అయిపోయిందని చంద్రబాబు ప్రజలలో విశ్వాసం కోల్పోయాడని వైవీ సుబ్బారెడ్డి కామెంట్లు చేశారు. టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్లే అమిత్ షా తారక్ తో మాట కలిపారని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని గట్టిగా చర్చ జరుగుతోంది. రాజకీయాలకు సంబంధించి తన మనసులో ఉన్న మాటను తారక్ ఎప్పుడు బయటపెడతారో చూడాల్సి ఉంది. తారక్ రాజకీయాలలో సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు.