పెళ్ళి చేసుకుంటే దయ్యం వదిలిస్తాం… గుండెపోటు రావడంతో బయటపడిన అసలు విషయం!

ప్రస్తుత కాలంలో చాలామంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. అని రంగాలలో దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇలాంటి మూఢవిశ్వాసాల పట్ల నమ్మకంగా ఉండటం వల్ల దొంగ బాబాల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. ఇప్పటికే ఇలా అంటే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాదులో కూడా ఇటువంటి సంఘటన వెలుగు చూసింది. మతిస్థిమితం లేని యువతికి దయ్యం పట్టిందని బెదిరించి నాకిచ్చి పెళ్లి చేస్తే దయ్యం వదిలేస్తానని చెప్పాడు. తీరా పెళ్లి సమయంలో గుండెపోటు రావడంతో పెళ్లి కొడుకు నిరసన రూపం బయటపడింది.

వివరాలలోకి వెళితే… నెల్లూరు జిల్లా ఏ.ఎస్‌.పేట (అనుమసముద్రంపేట) రహ్మతుల్లా దర్గా ఇన్‌ఛార్జి షా గులాం నక్షాబంధీ హఫీజ్‌ పాషా(55)కు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలున్నారు. దయ్యాలు, భూతాలు వదిలిస్తానంటూ పూజలు చేస్తుంటాడు. కొద్దికాలం క్రితం మకాం హైదరాబాద్‌కు మార్చి నెలలో 4-5 రోజులు ఏఎస్‌పేటలోని దర్గాకు వెళ్తుంటాడు. అయితే టోలిచౌకికి చెందిన యువతి (19) చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.దీంతో కుటుంబ సభ్యులు ఆమెను రహమతుల్లా దర్గాకు తీసుకెళ్లారు. యువతికి దయ్యం పట్టిందని ప్రాణాలు తీసేవరకు వదలదని,చావు నుంచి తప్పించుకోవాలంటే తనకిచ్చి వివాహం చేయాలని తేల్చి చెప్పాడు. దీంతో వేరే దారిలేక యువతి కుటుంబ సభ్యులు వివాహానికి ఒప్పుకొన్నారు.

అయితే వివాహానికి మండపం మాట్లాడి అన్ని సిద్దం చేశారు. తీరా శనివారం రాత్రి టోలిచౌకిలోని ఒక ఫంక్షన్‌ హాలుకు వస్తుండగా అతడికి గుండెలో ఇబ్బందిగా అనిపించడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అతనికి అప్పటికే పెళ్లయినట్లు తెలిసింది. దీంతో ఆదివారం యువతితో కలిసి లంగర్‌హౌస్‌ ఠాణా లో ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే నిందితుడిని తప్పించేందుకు తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది.