మహిళా కార్యదర్శిని లైంగిక వేదింపులకు గురిచేసిన ఎంపీడీఓ.. మహిళ చేసిన పనికి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైంది. ఒంటరిగా వెళ్తున్న మహిళల మీద హత్యాచారాలు జరగటమే కాకుండా ఎంతోమంది మహిళలని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది మహిళలు ధైర్యంగా వారిని ఎదుర్కొంటుంటే మరి కొంతమంది మాత్రం ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలలో ఇటువంటి వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి ప్రభుత్వం తరఫున పనులు చేయించుకోవడానికి వచ్చిన మహిళల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి దారుణ ఘటన ఇటీవల నెల్లూరులో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన ఒక మహిళా కార్యదర్శిని ఎంపీడీఓ పఠాన్‌ఖాన్‌ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. తరచూ మహిళకు ఫోన్ చేసి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడటమే కాకుండా మెసేజ్ లు చేస్తూ ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఎంతోకాలం ఈ బాధను భరించడం మహిళా కార్యదర్శి తన బంధువులతో తన గోడు చెప్పుకొని విలపించింది. ఈ క్రమంలో ఆ మహిళా కార్యదర్శి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గురువారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి పఠాన్ ఖాన్ ని ఈ విషయం గురించి నిలదీశారు. అయితే పఠాన్ ఖాన్ తను ఏ తప్పు చేయలేదని చెప్పటంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఎంపీడీవో పఠాన్ కాన్ మీద దాడికి దిగారు.

ఈ క్రమంలో ఒక మహిళ ఎంపీడీవో చొక్కా పట్టుకొని ఈడ్చికొచ్చి చాచి కొట్టింది. మహిళా కార్యదర్శిని ఇలా లైంగిక వేధింపులకు గురి చేయటంతో ఆమె మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిందని, ఆమె సంసారం నాశనమైపోతోంది అంటూ విరుచుకుపడింది. ఈ క్రమంలో సహా ఉద్యోగులు పఠాన్ ఖాన్ ని కాపాడటానికి ప్రయత్నించారు. అయినప్పటికీ గ్రామస్తులు పఠాన్ ఖాన్ మీద దాడి చేసి దేహశుద్ధి చేశారు. పఠాన్ ఖాన్ ని విధుల నుండి సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు.ఈ కమిటీ శుక్రవారం ఇందుకూరుపేటకు వెళ్లి విచారణ చేసిన తర్వాత వారి నివేదిక ఆధారంగా ఎంపీడీవో మీద చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటన నెల్లూరులో తీవ్ర కలకలం రేపుతోంది.