నెల్లూరు జిల్లాలో దారుణం.. పంతులు పెళ్ళి చేయలేదని ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సమాజంలో రోజురోజుకు చాలా వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి చేసుకోలేదని ఒకడు…. పెళ్లి చేయాలని ఒకడు… పరీక్షలు ఫెయిల్ అయ్యామని ఒకడు…. చంపడమో చావడమో చేస్తుంటారు. కొంతమంది పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా మరొక పెళ్లికి రెడీ అవుతుంటారు. ఇలాంటి వ్యక్తికి నచ్చ చెప్పే ప్రయత్నంలో ఒక పూజారికి అనుకోని సంఘటన ఎదురయింది.

ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని ఉలవపాడులో చోటుచేసుకుంది. ఉలవపాడుకు చెందిన రాయపాటి నాగరాజుకు భార్య భారతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను స్థానికంగా ఫోటో స్టూడియోలో పనిచేస్తుంటాడు. అయితే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో వారి మధ్య గొడవలు పెరిగి భార్య తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా నాగరాజు ఒంటరిగా జీవిస్తున్నాడు.

ఈ క్రమంలో నాగరాజు మరొక యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ యువతిని తనతో పాటు, తనకు ఇదివరకే పరిచయం ఉన్న బిట్రగుంటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేసే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. తమకు పెళ్లి చేయాలని ఆ పూజారిని కోరాడు. దానికి ఆ పూజారి నిరాకరించడమే కాకుండా, నీకు ఇదివరకే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని వారితో సంతోషంగా గడపాలని అతనికి సూచించాడు.

పూజారి మాటలు విన్న నాగరాజు ఆలోచనలో పడ్డాడు. తనతో తీసుకువచ్చిన అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడి నుండి తీసుకొచ్చాడో అక్కడే వదిలి తిరిగి పూజారి ఇంటికి వచ్చాడు. నాగరాజు పూజారి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని… ఈ రాత్రికి ఇక్కడ పడుకొని ఉదయాన్నే ఉలవపాడుకి వెళ్తానని నాగరాజు పూజారికి చెప్పాడు. పూజారి కూడా నాగరాజుని అక్కడే పడుకోమని వెళ్లి నిద్రించాడు. ఉదయం లేచి చూసేసరికి పూజారికి గుండె గుభేలుమనిపించే ఘటన ఎదురయింది. ఇంటి ఆవరణలో నాగరాజు ఉరికి వేలాడుతూ కనిపించాడు. పూజారి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండితుడి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని విచారించారు. నాగరాజు ది ఆత్మహత్య…. లేక మరేయితర కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగాంతం చేశారు.