పాముతో సెల్ఫీలు… ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోటోలు తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఏ చిన్న పని చేసినా కూడా ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అందరికీ ఒక అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో కొంతమంది యువతీ యువకులు ఫోటోలు తీసుకోవడానికి సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ సాహసాల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. తాజాగా పాముతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే… నెల్లూరు జిల్లాలోని కందుకూరు బస్టాండులో పాములు ఆడించే వ్యక్తి ఉండటం గమనించిన ఒక యువకుడు ఆ పాముని దూరం నుండి చూసి ఆనందించకుండా పాముల పట్టే వ్యక్తిని అడిగి మెడలో వేసుకొని సెల్ఫీలకు ఫోజులు ఇచ్చాడు. ఇలా పాముతో సెల్ఫీలు దిగిన తర్వాత పాముని మెడ నుండి తీస్తుండగా పాము వెంటనే అతని మెడ మీద కాటు వేసింది. ఇలా పాము కాటు వేయడంతో ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు . దీంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే మార్గం మధ్యలోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

పాముతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైక్ లు రాబట్టాలనుకున్న యువకుడు పాము కాటు వేయడంతో ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందిన కొడుకు ఇలా పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లితండ్రుల రోదన వర్ణాతీతంగా మారింది. ఇక ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పాములు ఆడించే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు . యువకుడు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.