బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఫలిస్తే ప్రత్యర్థి పార్టీలకి వచ్చే ఎన్నికలలో చావో రేవో పరిస్తితేనా?

if the bjp's plan work, will be difficult for other parties in next elections

రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేయటానికి అనేక దారుల్ని ఎంచుకుంటారు నాయకులు , సామ దాన బేధ దండోపాయాలన్ని వాడేస్తుంటారు.మనం ఎంత బలంగా ఉన్నప్పటికీ ఎదుటివారిని పూర్తిగా బలహీనుల్ని చేస్తేనే ఇక మనకి పోటీ లేకుండా అధికారం మనతోనే ఉంటది అనేది ఒక విజయ రహస్యం. తెలుగుదేశానికి తనకు కావాల్సినంత మెజారిటీ ఉన్నా కూడా ఇతర పార్టీలకు గేలం వేయడం, ఎదుటి వారిని బలహీనులను చేయడం, రాజకీయంగా తీరని దెబ్బ కొట్టడం అలవాటుగా మారిపోయింది. ఇపుడు ఆ కల్చర్ అన్ని పార్టీలకు పాకింది.మా పార్టీ లెక్క వేరు అని చెప్పుకుంటున్న బీజేపీకి కూడా ఆ అలావాట్లు బాగానే అబ్బాయని అంటున్నారు.

ఏపీలో సొంత బలం పెంచుకోకుండా ఎదుటి పార్టీల వైపు చూడడం, వారిని తమ పార్టీలోకి తెచ్చి బలం పెరిగిందని జబ్బలు చరచుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇపుడు సోము వీర్రాజు కొత్త కామందుగా వచ్చాక అర్జంటుగా అధికారం మీద ఆశ పుట్టింది. ప్రస్తుత అసెంబ్లీలో సీటు ఒక్కటి కూడా లేకపోయినా కూడా బీజేపీ ఏపీలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీలను ఎదిరించాలని కసితో రగిలిపోతోంది. దాంతో వీర్రాజు బాహాటంగానే టీడీపీ, వైసీపీ నేతలకు ఆహ్వానం పలుకుతున్నారు.

if the bjp's plan work, will be difficult for other parties in next elections
Bjp Vs Tdp Vs Ysrcp

ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల మీద బీజేపీ కన్ను పడింది. ఇక్కడ టీడీపీ కంచుకోటను వైసీపీ బద్దలు కొట్టడంతో ఆ మిగిలిన పనేదో తాము కూడా చేస్తే పోలా అని బీజేపీ అనుకుంటోంది. దాంతో టీడీపీ లో మిగిలిన వారిని, వైసీపీ వైపు వెళ్ళలేని వారిని దగ్గరకు చేర్చుకోవాలనుకుంటోంది. ఆ విధంగానే విజయన‌గరం జిల్లాలో సీనియర్ టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావుని బీజేపీ అక్కున చేర్చుకుంది. ఆయనకు ఇప్పటికే టీడీపీ వైసీపీలతో రాజకీయ సంబంధాలు ముగిసాయి. ఇలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ ని దువ్వుతోంది. వారి అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలనుకుంటోంది.

తాజాగా పార్టీ పదవుల పంపిణీలో చంద్రబాబు గంటా వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన కనీసం గంటా శ్రీనివాసరావుని ఏ దశలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. వెనక వచ్చిన అనితను పొలిట్ బ్యూరో మెంబర్ ని చేసిన బాబుకు గంటాకు కూడా ఒక పదవి ఇవ్వడం కష్టం కాదు కానీ గంటాను కావాలనే దూరం పెట్టారు. అలాగే విజయనగరంలో ఉన్న ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడులతో సహా ఓ అతి పెద్ద గ్యాంగ్ నే ఏకంగా బీజేపీలోకి ఆహ్వానించాలను కుంటోంది. ఉత్తరాంధ్ర మీద కన్నేసిన సోము వీర్రాజు అక్కడే పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గంటాను రమ్మని పిలిచినట్లుగా టాక్ ఉంది. గంటా సరేనంటే ఉత్తరాంధ్రా రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని అంటున్నారు. బీజేపీ పార్టీ కూడా బలం పుంజుకుని రాబోయే ఎన్నికలలో మిగిలిన పార్టీలకి గట్టి పోటీ ఇచ్చేవిధంగా తయారవుతుంది .