Jamil Elections: జమిలి ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాలలో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Jamili Elections: కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానానికి పూర్తిగా కట్టుబడి ఉందని తెలుస్తది ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం ఎంతో మంచిదని గతంలో వాజ్పేయి ఉన్నప్పటి నుంచి ఈ విషయం పట్ల చర్చలు జరుగుతున్నాయి అయితే ఇటీవల మోడీ ప్రభుత్వంలో ఈ విషయంపై చర్చలు జరగడమే కాకుండా ఈ బిల్లుకు ఆమోదం కూడా పడిందని తెలుస్తుంది.

ఇలా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం కోసం కేంద్ర మంత్రులు ఇతర పార్టీ అధినేతలు కూడా సానుకూలంగా వ్యవహరించారు అయితే ఇలా జమిలి ఎన్నికలు కనక జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 2029వ సంవత్సరంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇలా 2029సంవత్సరంలో ఎన్నికలు జరిగితే ఎవరికి మేలు ఎవరికి నష్టం అనే విషయాన్ని వస్తే..

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటుచేసిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఎన్నికలు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు లాభపడగా మరికొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు నష్టపోతాయి. ఇక ఇటీవల లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం వుండదు. అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార కూటమికి (టిడిపి, జనసేన,బిజెపి) జమిలి ఎన్నికల నిర్వహణవల్ల లాభంగాని, నష్టంగాని లేదు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు కాస్త లాభదాయకమే అని చెప్పాలి.ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ముందే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంటే 2028 లో ఇక్కడ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. కానీ 2029 లో జమిలి ఎన్నికలు జరిగితే పదవీకాలం ముగిసినా కొంతకాలం ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలా ఐదారునెలలు అదనంగా పాలించే అవకాశం రేవంత్ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పాలి ఇలా తెలంగాణకు కాస్త లాభదాయకమని తెలుస్తుంది.