ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సమయాపాలన పాటించకపోతే వేతనంలో కోత విధించాలని నిర్ణయించింది. సమయానికి ఉద్యోగులు ఆఫీస్‌లకు రాకపోతే ఆ రోజును సెలవు దినంగా పరిగణించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని అధికారులు నిర్ణీత సమయానికి కార్యాలయాలకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు చేరుకోవాలని.. 10 నిమిషాల వరకు ఆలస్యమైనా ఫరవా లేదు కానీ అంతకుమించి ఆలస్యం అయితే మాత్రం జీతాల్లో కోత ఉంటుంది. అయితే ఇందులో ఉద్యోగులకు ప్రభుత్వం కాస్త వెసులుబాటు కల్పించింది. 10.10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కార్యాలయానికి కాస్త అలస్యమైతే.. నెలకు మూడు పర్యాయాలు మాత్రం వదిలేస్తారు. ఆ పరిమితి దాటితే మాత్రం వేతనంలో కోత ఉంటుంది.