చంద్రబాబు ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్‌కి పండగే.!

ఈసారికి జనసేన పార్టీకి అవకాశమిచ్చి చూద్దాం.. అన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వస్తే.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ అనూహ్యంగా మారతాయ్.!

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తినేసింది. ఆ తర్వాత పుంజుకోలేదు. కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అనూహ్యమైన విజయాన్నిచ్చాయి. దాంతో, తాము గణనీయంగా పుంజుకున్నామని టీడీపీ చెబుతోంది.

అయితే, రాజకీయాల్లో తలపండిపోయిన చంద్రబాబుకి తెలుసు, రాష్ట్రంలో ప్రస్తుతం పొలిటికల్ ఈక్వేషన్ ఎలా వుందో.! అటు లోకేష్ పాదయాత్ర చేస్తున్నా, ఇటు చంద్రబాబు ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అంటూ ఎక్కడికక్కడ సభలు పెడుతున్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు జనం అధికారమిస్తారన్న నమ్మకం టీడీపీ అధినేతలో కనిపించడంలేదట.

మరి, ఏం చెయ్యాలి.? ‘నేను ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్ధంగా వున్నాను..’ అంటూ జనసేన అధినేత చేసిన ప్రకటన ఒక్కసారిగా టీడీపీలో కుదుపుకి కారణమయ్యింది. ‘ఆయనెలా ప్రకటించుకుంటారు.? ఇదేనా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పడమంటే.?’ అంటూ టీడీపీ నేతలు గింజుకుంటున్నారు.

మరోపక్క, కొందరు టీడీపీ ముఖ్య నేతలు ‘ఈసారికి పవన్ కళ్యాణ్‌ని ముందు పెడదాం.. ఎన్నికల ఫలితాల తర్వాత ఈక్వేషన్స్‌ని పట్టి అప్పుడు నిర్ణయాలు మార్చుకుందాం..’ అని సూచిస్తున్నారట. ఎటూ, టీడీపీ కంటే జనసేన ఎక్కువ సీట్లు పోటీ చేయకపోవచ్చు.. పొత్తుల నేపథ్యంలో. అదే టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం వుంది.

కానీ, ఇదంతా జరగాలంటే, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి ఎడ్జ్ అనేది వచ్చే ఎన్నికల్లో వుండాలి కదా.?