AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలు సైతం బెదిరింపులకు పాల్పడుతూ పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నారు అయితే ఇలాంటి విషయాల పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హోంమంత్రి అనిత సైతం ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ అందరికీ తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.
తాజగా హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ఉన్న సారిపల్లిపాలెం నివాసంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కలిశారు. ఇలా ప్రజలను కలిసిన ఈమె వారి సమస్యలను తెలియజేస్తూ అందజేసిన వినతి పత్రాలను సేకరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ఇకపోతే ఈమెతో కొంతమంది ఫోటోలు దిగడానికి కూడా ఎంతో ఆసక్తి చూపించారు.
ఈ విధంగా తనతో ఫోటోలు దిగిన వారందరితో కూడా హోం మంత్రి అనిత మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు ఈ విధంగా తనతో ఫోటోలు దిగి కొంతమంది ఇసుక దందా భూ దందాలకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని తెలియజేశారు. ఇలాంటి తప్పులకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదని చెప్పారు. సీతంపాలెంకు చెందినవారు ఓ వ్యక్తి తమ వ్యవసాయ పరికారలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని హోంమంత్రికి చెప్పారు. అలాగే ఏపీఐఐసీ నిర్వాసితుల కోసం పెదబోదుగల్లం దగ్గర చేపడుతున్న భూసేకరణ పరిహారం కోసం కూడా రైతులు ఈమెను కలిశారు.
ఈ భూ సేకరణ కార్యక్రమంలో భాగంగా రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు 30 లక్షల వరకు నష్ట పరిహారం అందజేస్తున్నామని ఈమె తెలియజేశారు. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్న రైతులు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు తాను అధికారులతో మాట్లాడి నష్టపరిహారం మరింత పెంచే ప్రయత్నాలు కూడా చేస్తానని అనిత హామీ ఇచ్చారు.