SOS :హైదరాబాద్ పోలీసులు చిన్న సాయం అడుగుతున్నరు

హైదరాబాద్  లో భద్రంగా ఎలా ఉండాలి, ఎలా ఉండనీయాలనే  దానిమీద హైదరాబాద్ పోలీసులు మాంచి ఎజుకేటివ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు.

మొన్నా మధ్య వర్షాకాలంలో రోడ్ల మీద వాహనాలలో ఝామ్మని దూసుకువెళ్లే మహానుభావులు పాదచారుల మీద కనికరం చూపాలని అద్భుతమయిన పోస్టునొకదాన్ని ట్విట్టర్ పెట్టారు. అది సూపర్ హిట్టయింది. చూసినోళ్లెవరికైనా అలాంటి సంఘటనలు గుర్తొచ్చి రోడ్లమీద నీళ్లు నిలిచిన చోట్ల (ఇలాంటి ప్రదేశాలు మన నగరాలలో చాలా ఎక్కువగానే ఉంటాయి) జాగ్రత్తగా వెళ్లేలా జ్ఞానం తెప్పిస్తుంది.

ఇపుడు పౌరుల భద్రత కోసం మరొక  గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇబ్బందులొచ్చినపుడు మీరెక్కడున్నా మేం సాయం చేస్తాం, అయితే, మాకూ మీరొక చిన్న సాయం చేయండంటున్నారు. ఏమిటా సాయం, ఏమీ లేదు సింపుల్, వాళ్లు రూపొందించిన ‘హాక్ ఐ’ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండని చెబుతున్నారు. ఈయాప్ డౌన్ లోడు చేసుకుంటే, మీరు SOS బటన్ తయారు చేసుకోవచ్చు.  దీనికొక మేసేజ్ ను ముందే తయారుచేసుకుని సేవ్ చేసుకోవచ్చ. దగ్గరి వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వొచ్చు.  ఎమర్జీన్సీ వచ్చినపుడు మీరు సింపుల్ గా మీSOS  బటన్ నొక్కితే చాలు, మీకు హైదరాబాద్ పోలీసుల నుంచి సాయం అందుతుంది. మీ సమాచారం మీ సన్నిహితులకు వెళుతుంది. మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు అందరికి బ్రహ్మాండంగా పనికొచ్చేది ఈ యాప్. అంతా డౌన్ లోడో చేసుకోవాలని కోరుతున్నారు.