అరెస్ట్ లను ఆపలేకపోతున్న వైసీపీ.. పార్టీని నమ్ముకున్న వాళ్లకు షాకేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలలో మెజారిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వెలువడుతుండటం గమనార్హం. అయితే తీర్పులు వ్యతిరేకంగా వచ్చిన సమయంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లలో కొంతమంది న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అయితే ఇందుకు సంబంధించి కేసులు నమోదు కాగా తాజాగా మరి కొందరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు అరెస్ట్ అయ్యారు.

వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్నా అరెస్ట్ లను ఆపలేకపోవడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని నమ్ముకున్న వారి విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వైసీపీ సర్కార్ అరెస్ట్ లను ఆపలేకపోతుందని అదే సమయంలో అరెస్ట్ అయిన వాళ్లకు తమ వంతు సహకారం అందించే విషయంలో విఫలమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వైసీపీ తరపున సోషల్ మీడియా యాక్టివిస్ట్ లుగా పని చేయడానికి ఈ కారణం వల్లే చాలామంది దూరమవుతున్నారు. పార్టీ కోసం పని చేసే సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు భరోసా కల్పించే విషయంలో జగన్ సర్కార్ ఫెయిలవుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. విడతల వారీగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా వైసీపీపై ఉంది.

వైసీపీ కోసం పని చేసి కొన్ని నెలల పాటు జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల కుటుంబాలకు తమ వంతు సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత కూడా వైసీపీపై ఉంది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పవచ్చు.